త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manipur | మ‌రోసారి భ‌గ్గుమ‌న్న మ‌ణిపూర్‌.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహ‌నాల‌కు నిప్పు

Manipur | ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్ (Manipur)లో మ‌రోసారి ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. సేనాపతి ప‌ట్ట‌ణం (Senapati town)లోని అస్సాం రైఫిల్స్ క్యాంప్ (Assam Rifles camp)పై మూక‌దాడి జ‌రిగింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత సాయుధులు క్యాంప్‌ను ల‌క్ష్యంగా చేసుకొని రాళ్లు రువ్వారు.

D

National | Published On Jul 15, 2026, 1.46 pm IST

Manipur | మ‌రోసారి భ‌గ్గుమ‌న్న మ‌ణిపూర్‌.. అస్సాం రైఫిల్స్ క్యాంప్‌పై మూక దాడి.. వాహ‌నాల‌కు నిప్పు
Advertisement

Manipur | త్రినేత్ర‌.న్యూస్ : ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్ (Manipur)లో మ‌రోసారి ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. సేనాపతి ప‌ట్ట‌ణంలోని (Senapati town) అస్సాం రైఫిల్స్ క్యాంప్ (Assam Rifles camp)పై మూక‌దాడి జ‌రిగింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి త‌ర్వాత సాయుధులు క్యాంప్‌ను ల‌క్ష్యంగా చేసుకొని రాళ్లు రువ్వారు (Stones thrown). వాహ‌నాల‌కు నిప్పుపెట్టి విధ్వంసం సృష్టించారు. రంగంలోకి దిగిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు వారిని చెద‌రగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జ‌రిపారు. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సేనాప‌తిలోని ఓక్లాంగ్ వ‌ద్ద ఉన్న ఎన్‌ఎస్‌సీఎన్ (ఐఎం) క్యాంప్‌కు పశ్చిమంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మకుయిలాంగ్డి ప్రాంతంలో కొంద‌రు సాయుధులు తిరుగుతున్నార‌నే స‌మాచారంతో అస్సాం రైఫిల్స్ ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌, సెర్చ్ ఆప‌రేష‌న్ ప్రారంభించింది. ఆప‌రేష‌న్ స‌మ‌యంలో అస్సాం రైఫిల్స్‌ను స్థానికులు, ముఖ్యంగా మ‌హిళ‌లు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది అత్యంత సంయమనం పాటిస్తూ స్థానిక ప్రతినిధులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌డం, శాంతిని కాపాడ‌టమే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్థానికుల‌కు స‌ర్దిచెప్పారు. వారి అంగీకారంతో గ్రామాల్లోకి వెళ్లి సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగించారు.

ఆ త‌ర్వాత రాత్రి 9 గంట‌ల ప్రాంతంలో పెద్ద సంఖ్య‌లో నిర‌స‌న‌కారులు అస్సాం రైఫిల్స్ శిబిరం వైపు దూసుకొచ్చారు. క్యాంప్‌పై రాళ్లు రువ్వారు. అప్ర‌మ‌త్త‌పైన పోలీసులు, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు.. నిర‌స‌న‌కారుల‌ను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జ‌రిపిన‌ట్లు అధికారులు తెలిపారు. టియర్‌గ్యాస్‌ షెల్‌లు ప్రయోగించిన‌ట్లు వెల్ల‌డించారు. తిరిగి వెళ్తున్న సమయంలో గుంపులోని కొందరు అస్సాం రైఫిల్స్‌కు చెందిన వాహనాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, సీఆర్పీఎఫ్ ద‌ళాలు, మ‌ణిపూర్ పోలీసులు సంయుక్తంగా చ‌ర్య‌లు చేప‌ట్టి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని స‌ద‌రు ప్ర‌తినిధి వెల్ల‌డించారు.

Also Read..

రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వ‌ద్ద‌ అద్దె వాహనదారుల సమ్మె

వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్‌.. ఆ రూట్‌లో 20 రోజులు ట్రాఫిక్ ఆంక్ష‌లు

E20 వివాదం.. నా కుటుంబ వాటా 0.7 శాతం మాత్ర‌మే : నితిన్ గ‌డ్క‌రీ

Advertisement
Advertisement