త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వ‌ద్ద‌ అద్దె వాహనదారుల సమ్మె

Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బకాయిపడిన సుమారు రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సెక్రటేరియట్ వ‌ద్ద‌ అద్దె వాహనదారులు స‌మ్మెకు దిగారు (Rental car owners strike). పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలో ప్ర‌తినెలా ఇవ్వాల్సిన అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేల‌కు పెంచాల‌ని డిమాండ్ చేశారు.

D

Telangana | Published On Jul 15, 2026, 1.18 pm IST

Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వ‌ద్ద‌ అద్దె వాహనదారుల సమ్మె
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : ప్రభుత్వాధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు సమకూరుస్తున్న యజమానులు నేటి నుంచి స‌మ్మెకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బకాయిపడిన సుమారు రూ.170 కోట్ల పెండింగ్ బిల్లుల‌ను వెంట‌నే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద నిరసన చేప‌ట్టారు. అద్దె బిల్లుల‌ను ప్ర‌తీ నెలా ఐదో తేదీ నుంచి ప‌దో తేదీలోపు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.

బిల్లులు చెల్లించకపోవడంతో డీజిల్ ఖర్చులు, డ్రైవర్ల జీతాలు, వాహనాల ఇన్సూరెన్స్‌ల‌కు ఇబ్బందిగా మారింద‌ని తెలిపారు. ముఖ్యంగా EMIలు చెల్లించలేకపోతున్నామ‌ని.. దీంతో బ్యాంకుల నుంచి నోటీసులు వ‌స్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వాహ‌నాల‌ను జ‌ప్తు చేసే ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చేసేదేమీ లేక అప్పో సొప్పో చేసి ఈఎమ్ఐలు క‌డుతున్నామ‌ని వారు వాపోయారు. అదేవిధంగా ప్ర‌స్తుతం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలో ప్ర‌తినెలా ఇవ్వాల్సిన అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేల‌కు పెంచాల‌ని అద్దె వాహ‌నాల య‌జ‌మానులు డిమాండ్ చేశారు. వీరి స‌మ్మెతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా అద్దె వాహనాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి.

Also Read..

వాహ‌న‌దారుల‌కు అల‌ర్ట్‌.. ఆ రూట్‌లో 20 రోజులు ట్రాఫిక్ ఆంక్ష‌లు

సీఎం రేవంత్‌కు హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ: హ‌రీశ్ రావు

ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా ప్రకటించాల్సిన ఆదాయాలు ఇవే

Advertisement
Advertisement