Traffic Alert | వాహనదారులకు అలర్ట్.. ఆ రూట్‌లో 20 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Alert | సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్ (Railway Underpass) వద్ద రోడ్డు విస్తరణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులు చేపట్టున్నారు. ఈ నేపథ్యంలో నేపథ్యంలో గురువారం (జూలై 16) నుంచి 20 రోజుల పాటు అండర్‌పాస్‌ను పూర్తిగా మూసివేస్తున్నారు.
Traffic Alert | త్రినేత్ర.న్యూస్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్ (Railway Underpass) వద్ద రోడ్డు విస్తరణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనులు చేపట్టున్నారు. ఈ నేపథ్యంలో నేపథ్యంలో గురువారం (జూలై 16) నుంచి 20 రోజుల పాటు అండర్‌పాస్‌ను పూర్తిగా మూసివేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే అండర్‌పాస్ వద్ద 20 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు.
వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్ ప్రస్తుతం ఇరుకుగా ఉండటంతో పాటు, భారీ వర్షాల సమయంలో నీరు నిలిచిపోయి వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్నది. ఈ నేపథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు అండర్‌పాస్‌ను విస్తరించడం, సమర్థవంతమైన స్టార్మ్ వాటర్ డ్రెయిన్ వ్యవస్థను ఏర్పాటు పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అండర్‌పాస్‌ను తాత్కాలికంగా మూసివేసి, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించనున్నట్లు (Traffic Diversions) తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- మై హోమ్ మంగళా నుంచి వైశాలీనగర్ అండర్‌పాస్ మీదుగా హఫీజ్‌పేట్ వెళ్లే వాహనాలు.. మై హోమ్ మంగళా టీ-జంక్షన్ వద్ద యూ-టర్న్ తీసుకుని రాఘవేంద్ర నగర్ కాలనీ జంక్షన్, హైటెన్షన్ రోడ్, ఆర్టీఏ కార్యాలయం, కొండాపూర్, హఫీజ్‌పేట్ ఆర్ఓబీ మార్గంలో ప్రయాణించాలి.
- తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ వైపు నుంచి వైశాలీనగర్ అండర్‌పాస్‌కు వచ్చే వాహనాలు.. మై హోమ్ మంగళా టీ-జంక్షన్, రాఘవేంద్ర నగర్ కాలనీ, హైటెన్షన్ రోడ్, ఆర్టీఏ కార్యాలయం, కొండాపూర్, హఫీజ్‌పేట్ ఆర్ఓబీ/ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్‌పేట్, ఆల్విన్ జంక్షన్ వైపు వెళ్లాలి.
- హఫీజ్‌పేట్, ఆర్టీసీ కాలనీ, మై హోమ్ జువెల్ ప్రాంతాల నుంచి మై హోమ్ మంగళా వైపు వెళ్లే వాహనాలు.. పైప్‌లైన్ రోడ్, హఫీజ్‌పేట్ ఆర్ఓబీ/ఫ్లైఓవర్, జెన్‌పాక్ట్ వద్ద ఎడమ మలుపు, కొండాపూర్, ఆల్విన్ రోడ్, ప్రభుత్వ పాఠశాల యూ-టర్న్, హఫీజ్‌పేట్ ఆర్ఓబీ ద్వారా ప్రయాణించాలి.
- వాసవి లేక్ సిటీ, హఫీజ్‌పేట్ లేక్ ప్రాంతాల నుంచి మై హోమ్ మంగళా, రాఘవేంద్ర నగర్ వైపు వెళ్లే వాహనాలు.. స్పైర్ వన్ అపార్ట్‌మెంట్స్ యూ-టర్న్, హఫీజ్‌పేట్ ఆర్ఓబీ, జెన్‌పాక్ట్ వద్ద ఎడమ మలుపు, కొండాపూర్, ఆల్విన్ రోడ్, ప్రభుత్వ పాఠశాల యూ-టర్న్, హఫీజ్‌పేట్ ఆర్ఓబీ ద్వారా ప్రయాణించాలి.
- గోపాల్‌నగర్, కాల్వరీ టెంపుల్ ప్రాంతాల నుంచి మై హోమ్ మంగళా వెళ్లే వాహనాలు.. హఫీజ్‌పేట్ అండర్‌పాస్/ఆర్ఓబీ వద్ద కుడివైపు తిరిగి కొండాపూర్, ఆల్విన్ రోడ్, ప్రభుత్వ పాఠశాల యూ-టర్న్, హఫీజ్‌పేట్ ఆర్ఓబీ మీదుగా కొండాపూర్, రాఘవేంద్ర నగర్ వైపు వెళ్లాలి.
- ప్రజలు ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ట్రాఫిక్ నియంత్రణలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Fire Accident | ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. సమీపంలోని బిల్డింగ్‌లకు అంటుకున్న మంటలు
జులై 15, 2026

SSPE Disease After Measles | హైదరాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం: పిల్లల్లో ‘తట్టు’ తర్వాత వచ్చే ప్రాణాంతక SSPE ముప్పును గుర్తించండి!
జులై 14, 2026

Mudragada Padmanabham Passes Away | కాపు ఉద్యమ రథసారథి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
జులై 14, 2026
తాజావార్తలు
- ●Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనదారుల సమ్మె
- ●Nitin Gadkari | E20 వివాదం.. నా కుటుంబ వాటా 0.7 శాతం మాత్రమే : నితిన్ గడ్కరీ
- ●Harish Rao | సీఎం రేవంత్‌కు హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ: హరీశ్ రావు
- ●Income Tax Return | ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా ప్రకటించాల్సిన ఆదాయాలు ఇవే
- ●Vemula Prashanth Reddy | జైల్లో పెట్టినా కాంగ్రెస్ సర్కార్‌పై నా పోరాటం ఆగదు: వేముల ప్రశాంత్ రెడ్డి
- ●Guvvala Balaraju | ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోండి.. సీఎంకు రేవంత్‌కు గువ్వల బాలరాజు లేఖ

Hyderabad | రూ.170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ.. సెక్రటేరియట్ వద్ద అద్దె వాహనదారుల సమ్మె

Nitin Gadkari | E20 వివాదం.. నా కుటుంబ వాటా 0.7 శాతం మాత్రమే : నితిన్ గడ్కరీ

Harish Rao | సీఎం రేవంత్‌కు హడావుడి ఎక్కువ, అసలు విషయం తక్కువ: హరీశ్ రావు

Income Tax Return | ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా ప్రకటించాల్సిన ఆదాయాలు ఇవే



