త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania University Research Labs | ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ విప్లవం: రూ.1.75 కోట్లతో 3 హైటెక్ ల్యాబ్‌లు ప్రారంభం.. 24 గంటలూ విద్యార్థులకు ఏఐ సెంటర్

ఉస్మానియా యూనివర్సిటీలో రూ.1.75 కోట్లతో 3 అత్యాధునిక పరిశోధనా కేంద్రాలు ప్రారంభం. విద్యార్థులు, పరిశోధకులకు 24/7 ఏఐ సెంటర్, నయా ల్యాబ్స్ వివరాలు ఇవే!

J

Hyderabad | Published On Oct 5, 2026, 4.07 pm IST

Osmania University Research Labs | ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ విప్లవం: రూ.1.75 కోట్లతో 3 హైటెక్ ల్యాబ్‌లు ప్రారంభం.. 24 గంటలూ విద్యార్థులకు ఏఐ సెంటర్
Advertisement
  • రూసా 2.0 (RUSA 2.0) నిధుల నుంచి సుమారు రూ.1.75 కోట్ల వ్యయంతో ఓయూలో మూడు అత్యాధునిక కేంద్రాలు ఏర్పాటు
  • అడ్వాన్స్‌డ్ సింథసిస్ రీసెర్చ్ ల్యాబ్, మాలిక్యులర్ బయాలజీ & సెల్ కల్చర్ ల్యాబ్, ఏఐ & డిజిటల్ లెర్నింగ్ సెంటర్లను ప్రారంభించిన వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం
  • విద్యార్థులు, ఫ్యాకల్టీ, పరిశోధకుల కోసం ఈ మూడు కేంద్రాలు 24/7 అందుబాటులో ఉండేలా చర్యలు
  • ఏఐ సెంటర్‌లో డేటా అనలిటిక్స్, రీసెర్చ్ కోసం రూ.81 లక్షలతో 50 హై-ఎండ్ కంప్యూటర్లు, అధునాతన సాఫ్ట్‌వేర్ల సదుపాయం

Osmania University Research Labs | త్రినేత్ర న్యూస్ : అత్యాధునిక పరిశోధనలు, సాంకేతిక ఆధారిత విద్యా బోధనను ప్రోత్సహించడంలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో కీలక ముందడుగు వేసింది. రూసా 2.0 (RUSA 2.0) కింద సుమారు రూ.1.75 కోట్ల పెట్టుబడితో సిద్ధం చేసిన మూడు అధునాతన పరిశోధనా కేంద్రాలను సోమవారం క్యాంపస్‌లో ఘనంగా ప్రారంభించారు. ఓయూ వైస్-ఛాన్సలర్ సీనియర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం ముఖ్య అతిథిగా హాజరై ఈ సెంటర్లను విద్యార్థులు, పరిశోధకులకు అంకితం చేశారు.

Osmania University Launches 3 Hi-Tech Research Labs and AI Center

ఈ ప్రారంభోత్సవంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్‌డీ సీనియర్ ప్రొఫెసర్ ఎస్. జితేందర్ కుమార్ నాయక్, పీటీఎన్ఆర్-సీఎఫ్‌ఆర్‌డీ (PTNR-CFRD) డైరెక్టర్ ప్రొఫెసర్ జి. విజయ చరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : మేడిప‌ల్లిలో భారీ చోరీ.. బంగారం షాపులో రూ.2 కోట్ల విలువై బంగారు, డైమండ్ ఆభ‌ర‌ణాలు అప‌హ‌ర‌ణ‌

విద్యార్థుల కోసం 24/7 సేవలు

సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు, నాణ్యమైన పరిశోధనలపై అధ్యాపకులు, స్కాలర్లు దృష్టి సారించాలని ఈ సందర్భంగా వైస్-ఛాన్సలర్ కుమార్ మొలుగరం పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ పరిశోధనలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ మూడు కేంద్రాలను రాత్రింబవళ్లు (24/7) తెరిచి ఉంచుతామని ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు ఓయూ కేంద్రంగా మారేందుకు ఇదొక కీలక మైలురాయి అని స్పష్టం చేశారు.

Osmania University Launches 3 Hi-Tech Research Labs and AI Center

కొత్తగా ప్రారంభమైన మూడు కేంద్రాల ప్రత్యేకతలివే

ఏఐ & డిజిటల్ లెర్నింగ్ సెంటర్ (వ్యయం: రూ. 81 లక్షలు): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అనలిటిక్స్, డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో SPSS, మాలిక్యులర్ సొల్యూషన్, ArcGIS వంటి ప్రీమియం సాఫ్ట్‌వేర్‌లతో కూడిన 50 హై-ఎండ్ కంప్యూటర్ సిస్టమ్‌లను అందుబాటులోకి తెచ్చారు.

Osmania University Launches 3 Hi-Tech Research Labs and AI Center

మాలిక్యులర్ బయాలజీ & సెల్ కల్చర్ ల్యాబ్ (వ్యయం: రూ.52 లక్షలు): జీన్ ఎక్స్‌ప్రెషన్, కణ ప్రక్రియలు (cellular processes), బయో-మాలిక్యూల్స్, మాలిక్యులర్ మెకానిజమ్స్‌పై ప్రయోగాలు చేయడానికి ఇది వేదికగా నిలుస్తుంది.

Osmania University Launches 3 Hi-Tech Research Labs and AI Center

అడ్వాన్స్‌డ్ సింథసిస్ రీసెర్చ్ ల్యాబ్ (ASRL - వ్యయం: రూ.42 లక్షలు): నూతన కెమికల్ కాంపౌండ్స్, అధునాతన మాలిక్యులర్ వ్యవస్థల రూపకల్పన, సంశ్లేషణ (synthesis), విశ్లేషణకు అవసరమైన అంతర్జాతీయ స్థాయి పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు.

Osmania University Launches 3 Hi-Tech Research Labs and AI Center

ఈ అధునాతన కేంద్రాలు క్యాంపస్ పరిశోధకులకే కాకుండా.. బయటి పరిశోధనా సంస్థలు, పరిశ్రమలతో భాగస్వామ్యానికి (Industry-Academia Collaboration) సరికొత్త బాటలు వేస్తాయని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

Osmania University Launches 3 Hi-Tech Research Labs and AI Center

Also Read : కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వ‌తంగా వ‌న్‌వే..  

బాలాపూర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. పేలిన కెమిక‌ల్ డ్ర‌మ్ములు

Advertisement
Advertisement