త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Robbery | మేడిప‌ల్లిలో భారీ చోరీ.. బంగారం షాపులో రూ.2 కోట్ల విలువై బంగారు, డైమండ్ ఆభ‌ర‌ణాలు అప‌హ‌ర‌ణ‌

Robbery | హైద‌రాబాద్‌లోని మేడిపల్లిలో (Medipally) ఉన్న ఓ బంగారం షాపులో భారీ చోరీ జ‌రిగింది. అర్ధరాత్రి దుకాణం షెట్ట‌ర్ తొల‌గించిన దుండ‌గులు షాపులో ఉన్న సుమారు రూ.2 కోట్లు విలువ‌చేసే బంగారు, వ‌జ్రాభ‌ర‌ణాలు (Robbery) ఎత్తుకెళ్లారు.

G

Hyderabad | Published On Oct 5, 2026, 3.03 pm IST

Robbery | మేడిప‌ల్లిలో భారీ చోరీ.. బంగారం షాపులో రూ.2 కోట్ల విలువై బంగారు, డైమండ్ ఆభ‌ర‌ణాలు అప‌హ‌ర‌ణ‌
Advertisement

Robbery | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లోని మేడిపల్లిలో (Medipally) ఉన్న ఓ బంగారం షాపులో భారీ చోరీ జ‌రిగింది. అర్ధరాత్రి దుకాణం షెట్ట‌ర్ తొల‌గించిన దుండ‌గులు షాపులో ఉన్న సుమారు రూ.2 కోట్లు విలువ‌చేసే బంగారు, వ‌జ్రాభ‌ర‌ణాలు (Robbery) ఎత్తుకెళ్లారు. ఈ మేర‌కు ఉప్ప‌ల్ డీసీపీ సురేశ్ కుమార్ వెల్ల‌డించారు. మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని 'క్యారెట్‌ లేన్‌' జ్యువెలరీ షాప్‌లో (Caratlane Store) చొర‌బ‌డిన దొంగ‌లు కేవలం 5 నిమిషాల్లోనే రూ.2 కోట్ల విలువైన 450 బంగారు, వజ్రాభరణాలను కొల్లగొట్టినట్లు చెప్పారు. ఈ దోపిడీలో మొత్తం ఏడుగురు వ్య‌క్తులు పాలుపంచుకున్నార‌ని తెలిపారు.

డైమెండ్స్‌తో పాటు బంగారు ఆభరణాలు కూడా చోరీకి గురైనట్లు మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు చ‌ర్య‌లు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement