త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Job Mela | ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా.. 100 పోస్టుల భర్తీ

Job Mela | ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో (Employment Bureau) ఆధ్వర్యంలో నవంబర్ 25 జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నారు. లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ (Lulu International Shopping Mall)లో 100 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

D

Telangana | Published On Nov 18, 2026, 4.55 pm IST

Job Mela | ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా.. 100 పోస్టుల భర్తీ
Advertisement

Job Mela | త్రినేత్ర న్యూస్ : ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో (Employment Bureau) ఆధ్వర్యంలో నవంబర్ 25 జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా జ‌ర‌గ‌నుంది. ఈ జాబ్ మేళాలో భాగంగా లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ (Lulu International Shopping Mall)లో 100 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

షాపింగ్ మాల్‌లోని డేటా ఎంట్రీ ఆపరేటర్, సేల్స్ అసోసియేట్, క్యాషియర్, కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్‌ల‌కు సంబంధించి 100 పోస్టుల‌ను ఈ జాబ్ మేళా ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 30 ఏళ్ల వయసున్న అభ్యర్థుల‌కు మాత్ర‌మే ఈ జాబ్ మేళాలో అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు యూనివ‌ర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. నెలకు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు త‌మ విద్యార్హ‌త స‌ర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరోలో నేరుగా హాజరుకావాల‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Also Read..

దివ్యాంగులకు సమాన అవకాశాలు.. అడ్డంకులు లేని సమాజమే వికసిత భారత్ లక్ష్యం..!

కార్తీక‌మాసంలో అరుణాచ‌లం వెళ్లాల‌నుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ప్ర‌తివారం స్పెషల్ ట్రైన్‌.. టూర్ ప్యాకేజీ ఇదే

ఐపీఎల్ 2027 వేలానికి వేళాయె.. గోవాలో మినీ ఆక్ష‌న్‌

Advertisement
Advertisement