త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRSV | హైద‌రాబాద్‌లో రాహుల్ ప‌ర్య‌ట‌న‌.. బీఆర్ఎస్వీ నేత‌ల వినూత్న నిర‌స‌న‌

BRSV | రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయ‌కులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎన్నికలకు ముందు అధికారం కోసం అశోక్ నగర్‌లోని నిరుద్యోగులతో కలిసి చాయ్ తాగిన రాహుల్ గాంధీ, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని బీఆర్ఎస్వీ నాయకులు పేర్కొన్నారు.

S

Telangana | Published On Nov 14, 2026, 3.09 pm IST

BRSV | హైద‌రాబాద్‌లో రాహుల్ ప‌ర్య‌ట‌న‌.. బీఆర్ఎస్వీ నేత‌ల వినూత్న నిర‌స‌న‌
Advertisement

BRSV | త్రినేత్ర న్యూస్ : రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయ‌కులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్‌లోని టీ స్టాల్ వద్ద నిరుద్యోగ యువతతో కలిసి చాయ్ తాగిన రాహుల్ గాంధీ, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని విద్యార్థి నాయకులు గుర్తుచేశారు.

​అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు భర్తీ చేయాల్సిన 6 లక్షల ఉద్యోగాల ఊసే లేదని, కనీసం 10 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదని బీఆర్ఎస్వీ నాయకులు ఆరోపించారు. ​భారత్ సమ్మిట్‌కు వచ్చిన రాహుల్ గాంధీ నేరుగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ వద్దకు వచ్చి నిరుద్యోగులతో కలిసి చాయ్ తాగాలని, 6 లక్షల ఉద్యోగాల హామీపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

​ఈ సందర్భంగా అశోక్ నగర్‌లో ఒక కుర్చీని ఏర్పాటు చేసి, దానికి రాహుల్ గాంధీ ఫోటో అతికించి, బీఆర్ఎస్వీ నాయకులు శ్రీకాంత్, నాగేందర్‌లతో పాటు పలువురు విద్యార్థులు చాయ్ తాగుతూ నిరసన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement