One Way | కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే..
One Way | త్రినేత్ర న్యూస్: కేబీఆర్ పార్క్ (KBR Park ) చుట్టూ ఫ్లై ఓవర్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే (One Way) విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించింది. వన్‌వేలో భాగంగా డివైడర్లు తగ్గించి ఆరు లేన్లుగా మార్చనుంది. కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు (KBR Park Project) రీ-అలైన్‌మెంట్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గతంలో నిర్మించిన తలపెట్టిన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లకు బదులుగా ఒక ఫ్లైఓవర్, ఒక అండర్ పాస్ నిర్మించనుంది. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు 4.4 కి.మీ. ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌ను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మీడియాకు వెల్లడించారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ సింగల్ వే, ఫ్రీ లెఫ్ట్ విధానం మంచి ఫలితాలను ఇచ్చాయన్నారు. అందుకే సింగల్ వే విధానాన్ని శాశ్వతంగా ఉంచబోతున్నామని చెప్పారు. ప్లానింగ్‌లో మార్పులు చేసి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు ఒకే ఫ్లై ఓవర్‌ను (స్టీల్ బ్రిడ్జి) నిర్మించనున్నామని, ఏడాదిలో పూర్తి అయిపోతుందని వెల్లడించారు. కొత్త ప్లాన్ వల్ల ప్రభుత్వానికి రూ.400 కోట్లు ఆదా అవుతాయని చెప్పారు. బ్రిడ్జ్ పనులు, అండర్‌పాస్ పనులు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయని తెలిపారు.
కేబీఆర్ ప్రాజెక్టు రద్దు..
కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు కూడళ్లలో రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో స్టీలు బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి చేపట్టిన పనులను జీహెచ్ఎంసీ రద్దుచేసింది. నిర్మాణ పనుల వల్ల వాహనాల రాకపోకలకు సమస్య వస్తుందనే ఉద్దేశంతో గత నెల ‘వన్ వే’ విధానాన్ని అధికారులు అమల్లోకి తీసుకొచ్చారు. ఒకట్రెండు రోజులు వాహనదారులు ఇబ్బందిపడినా.. మూడో రోజు నుంచి సిగ్నళ్ల వద్ద నిరీక్షణ లేకుండా సాఫీగా సాగిపోవడం మొదలైంది. దీంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమైందని భావించిన ప్రభుత్వం రూ.వందల కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించడం వృథాగా భావించింది. ఈ నేపథ్యంలో జూబ్లీ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు గేట్, ముగ్దా జంక్షన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తదితర కూడళ్లలో తలపెట్టిన పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయా పనుల కోసం కాంట్రాక్టు సంస్థలు కేఎన్‌ఆర్, మేఘాతో చేసుకున్న ఒప్పందాల రద్దుకు కూడా జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం ఆమోదం తెలిపింది.
ప్రత్యామ్నాయంగా పంజాగుట్ట ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు మెట్రో స్టేషన్ రోడ్డును (జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36) కలుపుతూ ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించింది. దీని నిర్మాణంతో 4.4 కిలోమీటర్ల మేర వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించనున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లోని ముఫకంజా విద్యాసంస్థల వద్ద పైవంతెన ఎక్కితే నేరుగా చెక్‌పోస్టు మెట్రో స్టేషన్ కింద దిగొచ్చు. చెక్‌పోస్టు మెట్రో స్టేషన్ వద్ద వంతెన ఎక్కిన వాహనాలు ముఫకంజా కాలేజీ వద్ద దిగుతాయి. బంజారాహిల్స్ రోడ్డు నెం.1వైపు వెళ్లే వాహనాల కోసం ప్రత్యేకంగా ఎలివేటెడ్ కారిడార్ నుంచి జలగం వెంగళరావు పార్కు వరకు ర్యాంపు నిర్మిస్తారు. డిజైన్లు పూర్తయ్యాక అంచనా వ్యయం, ఇతరత్రా అంశాలపై స్పష్టత రానుంది.
తాజావార్తలు
- ●Supreme Court | 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..
- ●MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..
- ●Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. మార్పు లేకుండా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..
- ●CJP | దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?

Supreme Court | 135 ఏళ్ల చరిత్ర కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీ తరలింపు.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ.. అయినా తగ్గని డీజిల్ ఇంజిన్ల అవసరం..

MrBeast | రూ.9 కోట్ల కోసం.. మొత్తం గ్రాసరీ స్టోర్ తినేయాలట..

Rakul Preet Singh | నేను ఎవరి బినామీని కాదు - నాకు ఎవరూ ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదు - ఐటీ సోదాలపై రకుల్ పోస్ట్






