Trisha | త్రిషకు డిప్యూటీ సీఎం..?
Trisha | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నటి త్రిష (Trisha)కు డిప్యూటీ సీఎం (Deputy CM) పదవి ఇచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ అవుతోంది.
Trisha | 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గానూ విజయ్ పార్టీ ఇప్పటి వరకూ 10 స్థానాల్లో గెలుపొందింది. మరో 99 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక ఈ ఎన్నికల్లో విజయ్ విజయం దాదాపు ఖరారైంది. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయ్ ముందంజలో ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే దూసుకెళ్తోంది. ఇదే సమయంలో ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నటి త్రిష (Trisha)కు డిప్యూటీ సీఎం (Deputy CM) పదవి ఇచ్చే అవకాశం ఉందని జోరుగా చర్చ జరుగుతోంది.
టీవీకేలో త్రిష కీలక పాత్ర..
అసెంబ్లీ ఎన్నికల నుంచి త్రిష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకు కారణం విజయ్‌తో డేటింగ్ వార్తలే. ఇక టీవీకే పార్టీ వెనుక త్రిష కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ ఓట్ల లెక్కింపుకు ముందే తిరుమల చేరుకున్న త్రిష.. అక్కడ శ్రీవారిని దర్శించుకున్నారు. విజయ్ పార్టీ గెలుపు కోసమే త్రిష స్వామివారిని దర్శించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక అక్కడి నుంచి చెన్నైకి వచ్చిన నటి.. నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి.. టీవీకే చీఫ్‌కు శుభాకాంక్షలు తెలిపింది.
అక్కడ పోటీకి నిలబెట్టి..
విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ముందంజలో ఉన్నారు. ఒక వేళ రెండు చోట్లా విజయ్ గెలిస్తే.. ఒక స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ స్థానంలో త్రిషను బరిలోకి దింపే యోచనలో విజయ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడి ఉంచి త్రిషను గెలిపించి ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే, దీనిపై విజయ్ గానీ, త్రిష గానీ అధికారికంగా ప్రకటించలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
విజయ్‌తో ప్రేమాయణం..
ప్రస్తుతం త్రిష దళపతి విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. లియో షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ప్రేమగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. త్రిష కారణంగానే విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైనట్లు చెబుతోన్నారు. సంగీత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన తర్వాత రోజే విజయ్, త్రిష కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరుకావడం ఈ రూమర్లకు బలాన్నిచ్చింది. ఈ ఎన్నికల ఫలితాల వేళ త్రిష తిరుమల వెళ్లడం, అక్కడి నుంచి విజయ్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా విషెశ్ తెలపడం వారి మధ్య ఉన్న రిలేషన్‌ను కన్ఫామ్ చేసినట్లయిందని నెటిజన్లు అంటున్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు కోలీవుడ్‌లో కోడై కూస్తోంది.
Also Read..
హాలీవుడ్ రేంజ్‌లో విజయ్ మాన్షన్.. ధర తెలిస్తే షాకే..!
అప్పుడు ఎంజీఆర్...ఇప్పుడు దళపతి విజయ్...
కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళ ప్రజలు చాటారు: కవిత
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

Karuppu | మరో వివాదంలో త్రిష కరుప్పు మూవీ – ఇళయరాజా ఫ్యాన్స్ ఫైర్ – క్షమాపణలు చెప్పిన మేకర్స్
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



