త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | కొత్త రాజ‌కీయ శ‌క్తులు అవ‌స‌ర‌మ‌ని త‌మిళ ప్ర‌జ‌లు చాటారు: క‌విత‌

Kavitha | త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) స్పందించారు. కొత్త రాజ‌కీయ శ‌క్తులు అవ‌స‌ర‌మ‌ని త‌మిళ ప్ర‌జ‌లు దేశానికి ఒక సంకేతం పంపార‌న్నారు.

G

Telangana | Published On May 4, 2026, 4.30 pm IST

Kavitha | కొత్త రాజ‌కీయ శ‌క్తులు అవ‌స‌ర‌మ‌ని త‌మిళ ప్ర‌జ‌లు చాటారు: క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) స్పందించారు. కొత్త రాజ‌కీయ శ‌క్తులు అవ‌స‌ర‌మ‌ని త‌మిళ ప్ర‌జ‌లు దేశానికి ఒక సంకేతం పంపార‌న్నారు. `ఉన్న వాళ్లతో విసిగిపోయాం, అధికార దాహార్తులతో వేసారి పోయాం, భ్రష్టుపట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగ రాయడానికి `కొత్త రాజకీయ శక్తులు` అవసరమని దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపారు.` అని క‌విత ట్వీట్ చేశారు.

త‌మిళ‌నాడులో రెండేండ్ల క్రితం స్థాపించిన‌ ద‌ళ‌ప‌తి విజ‌య్ నేతృత్వంలోని టీవీకే.. ద‌శాబ్దాలు త‌మిళ రాజ‌కీయాల‌ను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకేల‌ను మ‌ట్టిక‌రిపించింది. 234 స్థానాల్లో 108 ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. విజ‌య్ దెబ్బ‌కు సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 57 స్థానాలు, ఏఐఏడీఎంకే 69 స్థానాల‌తో స‌రిపెట్టుకున్నాయి.

Advertisement
Advertisement