త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mgr – Vijay | అప్పుడు ఎంజీఆర్‌…ఇప్పుడు ద‌ళ‌ప‌తి విజ‌య్‌…

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ హ‌వా కొన‌సాగుతోంది. అధికార డీఎంకే, ప్ర‌తిప‌క్ష అన్నాడీఎంకే పార్టీల దాటేసిన టీవీకే పార్టీ ఈ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా నిల‌వ‌బోతుంది. ఎంజీఆర్ త‌ర్వాత పోటీ చేసిన తొలి ఎన్నిక‌ల్లోనే త‌న పార్టీని గెలిపించిన నాయ‌కుడిగా విజ‌య్ నిలిచారు.

N

Entertainment | Published On May 4, 2026, 4.35 pm IST

Mgr – Vijay | అప్పుడు ఎంజీఆర్‌…ఇప్పుడు ద‌ళ‌ప‌తి విజ‌య్‌…
Advertisement

Mgr - Vijay |  త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించ‌బోతుంది. త‌మిళ‌నాడు సీఎంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ ప‌ద‌వి చేప‌ట్ట‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎంజీఆర్‌, జ‌య‌ల‌లిత త‌ర్వాత సీఎం సీట్‌లో కూర్చొనున్న మూడో త‌మిళ సినీ న‌టుడిగా విజ‌య్ నిల‌వ‌బోతున్నారు.

అప్పుడు ఎంజీఆర్‌...

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ టీవీకే పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఈ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించ‌బోతుంది. త‌మిళ‌నాడు సీఎంగా ద‌ళ‌ప‌తి విజ‌య్ ప‌ద‌వి చేప‌ట్ట‌నుండటం దాదాపు ఖాయమైంది. ఎంజీఆర్‌, జ‌య‌ల‌లిత త‌ర్వాత సీఎంగా ప‌ద‌విని చేప‌ట్ట‌నున్న త‌మిళ సినీ న‌టుడిగా విజ‌య్ నిల‌వ‌బోతున్నారు.

తొలి సీఎం...

సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టి సీఎం అయిన తొలి వ్య‌క్తిగా ఎంజీఆర్ నిలిచారు. తొలుత డీఎంకే పార్టీలో చేరిన ఎంజీఆర్‌...క‌రుణానిధితో విభేదాల కార‌ణంగా పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత 1972లో అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు. 1977 ఎన్నిక‌ల్లో తొలిసారి పోటీ చేసిన అన్నాడీఎంకే పార్టీ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. 234 అసెంబ్లీ స్థానాల‌కు గాను...200 సీట్ల‌లో పోటీ చేసిన అన్నాడీఎంకే 144 స్థానాల్లో విజ‌యం సాధించింది. పోటీ చేసిన తొలి ఎన్నిక‌ల్లోనే త‌న పార్టీని గెలిపించిన ఎంజీఆర్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు.

ఇప్పుడు విజ‌య్‌...

ఎంజీఆర్ రేర్ ఫీట్‌ను విజ‌య్ రీక్రియేట్ చేశారు. కోలీవుడ్‌లో టాప్ స్టార్‌గా కొన‌సాగుతోన్న విజ‌య్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తూ 2024లో టీవీకే పార్టీని స్థాపించారు. 2026 ఎన్నిక‌ల్లో తొలిసారి పోటీ చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోటీకి సిద్ధ‌మ‌య్యారు. 234 స్థానాల్లో విజ‌య్ పార్టీ బ‌రిలో నిలిచింది. వ్య‌క్తిగ‌తంగా విజ‌య్‌కి ఉన్న ఛ‌రిష్మా, ఇమేజ్‌తో పాటు రాజ‌కీయ వ్యూహాల కార‌ణంగా ఈ ఎన్నిక‌ల్లో టీవీకే పార్టీ సంచ‌ల‌న‌ విజ‌యం దిశ‌గా సాగుతోంది. ప్ర‌స్తుతం వంద‌కుపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఎంజీఆర్ త‌ర్వాత సొంతంగా పార్టీ పెట్టి...తొలిసారి పోటీ చేసిన ఎన్నిక‌ల్లోనే విజ‌యం సాధించిన నాయ‌కుడిగా విజ‌య్ చ‌రిత్రను సృష్టించారు.

Advertisement
Advertisement