Karuppu | మరో వివాదంలో త్రిష కరుప్పు మూవీ – ఇళయరాజా ఫ్యాన్స్ ఫైర్ – క్షమాపణలు చెప్పిన మేకర్స్
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కరుప్పు టీమ్ క్షమాపణలు తెలియజేసింది. ఆయన్ని అగౌరవపరచాలని అనుకోలేదంటూ ఓ అంటూ ప్రకటించింది. ఇళయరాజాకు కరుప్పు టీమ్ ఎందుకు క్షమాపణలు చెప్పిందంటే?
Entertainment | Published On May 19, 2026, 2.05 pm IST
Ilaiyaraaja | సూర్య, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన కరుప్పు మూవీని ఆది నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఓటీటీ డీల్ ఆలస్యం కావడంతో పాటు ఇతర కారణాల వల్ల వాయిదాపడుతూ వచ్చింది. మే 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ప్రీమియర్స్ మొదలుకావడానికి కొద్ది గంటల ముందు ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా షోస్ క్యాన్సిల్ అయ్యాయి. చివరకు ఆ వివాదాన్ని సెటిల్ చేసుకొని ఒక రోజు ఆలస్యంగా మే 15న ఈ సినిమా రిలీజైంది. ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలతో ఏర్పడిన విభేదాల కారణంగా త్రిష ప్రమోషన్స్‌కు దూరమవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఇళయరాజాకు క్షమాపణలు...
తాజాగా కరుప్పు టీమ్ మరో వివాదంలో చిక్కుకుంది. కరుప్పులో దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాపై కొన్ని సెటైరికల్ డైలాగ్స్ ఉన్నాయి. సరదాగా మేకర్స్ ఉపయోగించిన ఈ డైలాగ్స్ సినిమాను చిక్కుల్లో పడేశాయి. ఇళయరాజా గౌరవాన్ని తగ్గించేలా ఆ సంభాషలు ఉన్నాయంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వాటిని తీసేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాన్స్ విమర్శలతో కరుప్పు టీమ్ దిగొచ్చింది. ఇళయరాజాకు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఆ డైలాగ్స్‌ను తొలగిస్తున్నట్లు ఓ ప్రకటనను రిలీజ్ చేశారు.
క్షమాపణలు చెబుతున్నాం.
"ఇళయరాజాను ఉద్దేశిస్తూ ఈ సినిమాలోని డైలాగ్స్ పట్ల ఆయన బాధకు లోనయ్యారని తెలిసింది. ఉద్దేశపూర్వకంగా పెట్టిన డైలాగ్స్ కావవి. తన సంగీతంతో ఎన్నో ఏళ్లుగా సినీ రంగానికి సేవ చేస్తున్న ఆయన్ని అగౌరవపర్చాలని అనుకోలేదు. ఇళయరాజాపై సినిమాలో ఉన్న డైలాగ్స్‌ను తొలగిస్తున్నాం. ఇళయరాజాకు క్షమాపణలు చెబుతున్నాం" అని ఈ ప్రకటనలో కరుప్పు టీమ్ తెలిపింది.కరుప్పు మూవీకి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించాడు. మైథలాజికల్ టచ్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
సంబంధిత వార్తలు

Trisha | త్రిషకు ఇష్టమైన ఫుడ్ ఇదేనట – సీక్రెట్ రివీల్ చేసిన స్టైలిస్ట్
మే 18, 2026

Trisha | సూర్య, త్రిష మధ్య విభేదాలు? – చెన్నై క్వీన్‌ను అవమానించారంటూ ఫ్యాన్స్ ఫైర్
మే 18, 2026

Tollywood | సౌత్‌లో టాప్… నార్త్‌లో ఫ్లాప్… టాలీవుడ్ బ్యూటీలకు అచ్చిరాని బాలీవుడ్!
మే 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



