త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thalapathy Vijay | విడాకుల వ్య‌వ‌హారం.. భార్య‌కు రూ.250 కోట్లు ఆఫ‌ర్ చేసిన విజ‌య్‌..?

Thalapathy Vijay | విడాకుల (divorce) వ్య‌వ‌హారంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay) త‌న భార్య సంగీత (Sangeeta)కు రూ.250 కోట్లు భ‌ర‌ణం ఆఫ‌ర్ చేసినట్లు తెలిసింది. ఈ వ్య‌వ‌హారంలో రాజీ కుదుర్చుకునేందుకు విజ‌య్ త‌న భార్య‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌.

D

Movies | Published On Mar 4, 2026, 3.46 pm IST

Thalapathy Vijay | విడాకుల వ్య‌వ‌హారం.. భార్య‌కు రూ.250 కోట్లు ఆఫ‌ర్ చేసిన విజ‌య్‌..?
Advertisement

Thalapathy Vijay | ద‌ళ‌ప‌తి విజ‌య్ (Thalapathy Vijay), సంగీత (Sangeeta) విడాకుల వ్య‌వ‌హారం ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌తోపాటూ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. 26 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్న సంగీత.. విడాకుల కోసం చెన్నైలోని చెంగ‌ల్ప‌ట్టు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. అయితే, ఈ విడాకుల విష‌యంలో విజ‌య్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. ఈ వ్య‌వ‌హారాన్ని సైలెంట్‌గా ప‌రిష్క‌రించాల‌ని భావిస్తున్నార‌ట‌. అందుకే భార్య సంగీత‌కు భారీ మొత్తంలో భ‌ర‌ణం ఆఫ‌ర్ (Rs. 250 crores as alimony) చేసిన‌ట్లు త‌మిళ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

తమిళ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతున్న నివేదిక ప్రకారం.. ఈ వ్య‌వ‌హారంలో రాజీ కుదుర్చుకునేందుకు విజ‌య్ త‌న భార్య‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. కోర్టు వ‌ర‌కూ వెళ్ల‌కుండా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుందామ‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. ఇందుకోసం సంగీత‌కు విజ‌య్ రూ.250 కోట్లు భ‌ర‌ణం ఆఫ‌ర్ చేసిన‌ట్లు స‌మాచారం. సంగీత‌తోపాటూ ఇద్ద‌రు పిల్ల‌లు జాస‌న్ సంజ‌య్‌, దివ్య సాషాల భ‌విష్య‌త్తు కోసం ఇంత మొత్తాన్ని ఇచ్చేందుకు విజ‌య్ సిద్ధ‌ప‌డిన‌ట్లు టాక్‌. విజ‌య్ పెట్టిన ఈ ప్ర‌తిపాద‌న‌కు సంగీత ఒప్పుకుంటే.. కోర్టులో వేసిన విడాకుల పిటిష‌న్‌ను కూడా వెన‌క్కి తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యాన్ని కూడా విజ‌య్ గోప్యంగా ఉంచాల‌నుకుంటున్నార‌ని స‌న్నిహిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ త‌మిళ మీడియా నివేదిస్తోంది. అయితే, దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ క్లారిటీ లేదు. ఈ వార్త‌ల‌పై విజ‌య్ గానీ, సంగీత‌గానీ ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు.

పెద్ద‌ల అంగీక‌రారంతో 1999లో విజ‌య్‌, సంగీత పెళ్లిచేసుకున్నారు. విజ‌య్‌, సంగీత పెళ్లి రెండు సార్లు జ‌రిగింది. 1998లో లండ‌న్‌లో రిజిస్ట‌ర్ మ్యారేజీ చేసుకున్న వీరు...1999లో చెన్నైలో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఒక్క‌ట‌య్యారు. వీరికి కుమారుడు జాస‌న్ సంజ‌య్‌, కూతురు దివ్య సాషా ఉన్నారు. అయితే, విజ‌య్‌తో 26 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు ప‌లికేందుకు సంగీత సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు గ‌త వారం చెన్నై కోర్టులో విడాకుల పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న భ‌ర్త‌పై ఆమె సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

మరో నటితో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకొని తనను మానసికంగా వేదనకు గురిచేశాడని ఆరోపించింది. ఆమెతో బంధాన్ని తెచ్చుకుంటాన‌ని మాటిచ్చిన విజ‌య్‌.. దానిని నిల‌బెట్టుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అంతేకాదు ఆ హీరోయిన్‌తో క‌లిసి విదేశాల‌కు విహార‌యాత్ర‌కు కూడా వెళ్లాడ‌ని సంగీత త‌న పిటిష‌న్‌లో పేర్కొన్న‌ది. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి ఏడాది కాలంగా చాలానే ప్ర‌య‌త్నాలు చేశాన‌ని, అవేవీ ఫ‌లించ‌లేద‌ని సంగీత పిటిష‌న్‌లో పేర్కొంది. మ‌రో మార్గం లేకే విడాకుల తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

Also Read..

Rashi Khanna | జీవితం ఎటు తీసుకువెళ్తే అటే.. సినీ కెరీర్‌పై రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు..!

Iran Fires 40 Missiles | 40 క్షిప‌ణులు, 230 డ్రోన్లు.. యూఎస్‌, ఇజ్రాయెల్ స్థావ‌రాల‌పై ఇరాన్ భీక‌ర దాడులు

Irans Supreme Leader | ఇరాన్ కొత్త‌ సుప్రీం లీడర్ కూడా మా టార్గెటే : ఇజ్రాయెల్ హెచ్చరిక

Advertisement

తాజావార్తలు

Advertisement