Iran Fires 40 Missiles | 40 క్షిపణులు, 230 డ్రోన్లు.. యూఎస్, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు
Iran Fires 40 Missiles | ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై (US-Israeli Targets) 17వ విడత దాడులను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది.
International | Published On Mar 4, 2026, 2.45 pm IST
Iran Fires 40 Missiles | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఐదో రోజుకు చేరుకున్నాయి. అమెరికాపై ఇరాన్ ప్రతిదాడులను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజాగా కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై (US-Israeli Targets) 17వ విడత దాడులను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. దీన్ని 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4' గా పేర్కొంది.
అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. సుమారు 40 క్షిపణులను (Iran Fires 40 Missiles) ప్రయోగించినట్లు వెల్లడించింది. కువైట్, ఖతార్ , ఇరాక్‌లోని అగ్రరాజ్య స్థావరాలపై 230 డ్రోన్లతో దాడులు చేసినట్లు తెలిపింది. హిందూ మహాసముద్రంలో ఒక అమెరికన్ యుద్ధనౌకపై దాడి జరిపినట్లు ఐఆర్‌జీసీ తెలిపింది. దాడి సమయంలో ఒక అమెరికన్ ట్యాంకర్ నుంచి ఇంధనం నింపుకుంటోందని, ఈ దాడి కారణంగా రెండు నౌకలలోనూ మంటలు చెలరేగినట్లు వెల్లడించింది.
మరోవైపు ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి అయిన హర్ముజ్ జలసంధి (Strait Of Hormuz)పై కూడా ఐఆర్‌జీసీ కీలక ప్రకటన చేసింది. ఈ జలసంధిపై పూర్తి నియంత్రణ తమకు ఉందని వెల్లడించింది. ఈ మేరకు జలసంధిలో చమురు నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పిస్తుందని ట్రంప్ ప్రకటనకు కౌంటర్ ఇచ్చింది. ఈ జలసంధి నుంచి ఏమైనా నౌకలు ప్రయాణిస్తే ధ్వంసం చేస్తామని మరోసారి హెచ్చిరించింది.
Also Read..
Irans Supreme Leader | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కూడా మా టార్గెటే : ఇజ్రాయెల్ హెచ్చరిక
Moon | కుచించుకుపోతున్న చంద్రుడు.. ఉన్నట్లుండి మాయమైతే ఏం జరుగుతుంది..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US Iran Peace Memo | అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు? ‘వన్-పేజీ’ ఒప్పందంతో శాంతి చర్చలకు మార్గం
మే 6, 2026

Strait of Hormuz | ఇరాన్ కొత్త ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: హార్ముజ్ జలసంధి ఓపెనింగ్‌పై వీడని సస్పెన్స్
మే 2, 2026

Iran US conflict | హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడానికి ఇరాన్ 3 కండిషన్లు.. ట్రంప్ ఒప్పుకుంటారా?
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



