త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajinikanth | విజ‌య్ గెలుపుపై ఎలాంటి అసూయ లేదు – నీచ‌పు రాజ‌కీయాలు చేయ‌ను – ర‌జ‌నీకాంత్ కామెంట్స్‌

ద‌ళ‌ప‌తి విజ‌య్ సీఎం కాకుండా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లు త‌మిళ‌నాడులో పుకార్లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మాజీ సీఎం స్టాలిన్‌ను ర‌జ‌నీకాంత్ క‌ల‌వ‌డం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ఈ విమ‌ర్శ‌ల‌పై ర‌జ‌నీకాంత్ రియాక్ట్ అయ్యారు.

N

Entertainment | Published On May 17, 2026, 12.43 pm IST

Rajinikanth | విజ‌య్ గెలుపుపై ఎలాంటి అసూయ లేదు – నీచ‌పు రాజ‌కీయాలు చేయ‌ను – ర‌జ‌నీకాంత్ కామెంట్స్‌
Advertisement

Rajinikanth | ద‌ళ‌ప‌తి విజ‌య్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు తాను కుట్ర‌లు ప‌న్నిన‌ట్లు వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అన్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత సీఎం స్టాలిన్‌ను ర‌జ‌నీకాంత్ క‌ల‌వ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు ఇటీవ‌ల ఎయిర్‌పోర్ట్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విక్ట‌రీపై మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు ర‌జ‌నీకాంత్ స‌మాధానం ఇవ్వ‌కుండా వెళ్లిపోవ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ విమ‌ర్శ‌లు, ఇటీవ‌ల త‌మిళ‌నాడు రాజ‌కీయ ప‌రిణామాల‌ నేప‌థ్యంలో ర‌జ‌నీకాంత్ ఆదివారం మీడియా ముందుకు వ‌చ్చారు.

ఎలాంటి అసూయ లేదు...

విజ‌య్ ముఖ్య‌మంత్రి కావ‌డంపై త‌న‌కు ఎలాంటి అసూయ లేద‌ని ర‌జ‌నీకాంత్ అన్నారు. తాను రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పి చాలా కాల‌మైంద‌ని చెప్పారు. నేను రాజకీయాల్లో లేను..విజయ్ ముఖ్యమంత్రి కావడంపై నేనెందుకు అసూయపడ‌తాను. విజ‌య్ నాకు స‌మకాలీనుడు కాదు. ఇద్ద‌రి మ‌ధ్య 25 ఏళ్ల వ్య‌త్యాసం ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీతో పాటు రాష్ట్రంలోని రెండు ప్ర‌ధాన పార్టీల‌ను ఎదుర్కొని గొప్ప విజ‌యం సాధించారు. ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌లకు మించిన అద్భుత‌మైన గెలుపు ఇది. విజ‌య్ సీఎం కావ‌డం న‌న్ను ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఆనందం కూడా క‌లిగింది అని ర‌జ‌నీకాంత్ అన్నారు. క‌మ‌ల్ హాస‌న్ సీఎం అయితే అసూయ పడేవాన్నేమో అంటూ సరదాగా ర‌జ‌నీకాంత్ వ్యాఖానించారు.

రాజ‌కీయాల‌కు అతీతం....

రాజ‌కీయాల‌కు అతీతంగా మాజీ సీఎం స్టాలిన్‌తో త‌న‌కు స్నేహం ఉంద‌ని, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొల‌త్తూరులో స్టాలిన్ ఓట‌మి త‌న‌ను బాధ‌కు గురిచేసింద‌ని ర‌జ‌నీకాంత్ పేర్కొన్నారు. "ఎన్నికల్లో గెలుపోటములు సహజం.. కేవలం స్టాలిన్‌ను స్నేహపూర్వకంగా కలిసాను.. అది ఒక బాధ్యతగా భావించాను. కానీ డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల‌ని క‌లిపి విజ‌య్‌ని సీఎం కాకుండా అడ్డుకోవ‌డానికే నేను ప్ర‌య‌త్నాలు చేశాన‌ని, అందుకే స్టాలిన్‌ను క‌లిసిన‌ట్లు పుకార్లు సృష్టించారు..
అవ‌న్నీ అవాస్త‌వాలే"  అని ర‌జ‌నీకాంత్  వెల్ల‌డించారు. తాను స్టాలిన్ ను క‌ల‌వ‌డంలో ఎలాంటి రాజ‌కీయం లేద‌ని చెప్పారు. అలాంటి నీచ రాజకీయాలు తాను చేయ‌న‌ని, త‌న వ్యక్తిత్వం కూడా అలాంటిది కాదని ర‌జ‌నీకాంత్ అన్నారు.

వ్య‌క్తిగ‌తంగా శుభాకాంక్ష‌లు చెప్పా...

త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు మార్పును కోరుకున్నారు.. అందుకే విజ‌య్ ని గెలిపించారని రజనీకాంత్ అన్నారు. సినిమాల క్రేజ్‌తో పాటు యువ‌త‌రం, సోషల్ మీడియా సపోర్ట్‌ విజ‌య్ గెలుపుకు కార‌ణ‌మ‌య్యాయ‌ని ర‌జ‌నీకాంత్ చెప్పారు. విజ‌య్ సీఎం కావ‌డంపై తాను రియాక్ట్ కాలేద‌ని వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని
వెల్ల‌డించారు. విజ‌య్‌కి తాను వ్య‌క్తిగ‌తంగా ఇది వ‌ర‌కే శుభాకాంక్ష‌లు చెప్పాన‌ని ర‌జ‌నీకాంత్ పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement