Rashi Khanna | జీవితం ఎటు తీసుకువెళ్తే అటే.. సినీ కెరీర్‌పై రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు..!
Rashi Khanna | రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మద్రాస్ కేఫ్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఢిల్లీ భామ.. ‘ఊహలు గుసగుసలాడే’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళం, మలయాళ భాషల్లోనూ అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
Entertainment | Published On Mar 4, 2026, 3.13 pm IST
Rashi Khanna | రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మద్రాస్ కేఫ్ మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఢిల్లీ భామ.. ‘ఊహలు గుసగుసలాడే’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళం, మలయాళ భాషల్లోనూ అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రణాళిక ప్రకారం కెరీర్‌ను నడిపించాలనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని చెప్పింది. ‘కంఫర్ట్ జోన్‌లో ఉండటం నాకు అలవాటు కాదు. జీవితం ఎటు తీసుకెళ్తే అటే వెళ్లాను. ప్లాన్ చేసినవి జరగలేదు. వదిలేసుకున్న తర్వాతే అవకాశాలు వచ్చాయి’ అని పేర్కొంది.
హిందీలో ఇంకా కొత్తదాన్నేనని రాశీ భావిస్తోంది. ‘ఇప్పటివరకు నాలుగు సినిమాలే చేశాను. దక్షిణాది అభిమానులు ఇచ్చిన ప్రేమ, ఆదరణ ఎంతో పెద్దది. ఉత్తరాదిలో ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఇది మరో కొత్త అధ్యాయం’ అని చెప్పింది. తెలుగులో కెరీర్ ఆరంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని స్వీకరించానని తెలిపింది. ‘అప్పుడు నేర్చుకోవడంపైనే దృష్టి. పాత్ర చిన్నదా, పెద్దదా అనేది చూడలేదు. ఇప్పుడు మాత్రం భావోద్వేగాలకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. హిందీలో మహిళా ప్రధాన కథలు రావడం ఆనందంగా ఉంది’ అన్నది. 120 బహదూర్ మూవీలో ఫర్హాన్ అకర్త్‌తో కలిసి నటించడం ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని చెప్పింది.
‘పదేళ్ల క్రితం ఒక యాడ్‌లో కలిసి పనిచేశాం. అప్పుడు పెద్దగా మాట్లాడలేదు. మళ్లీ ఈ సినిమా సెట్లో కలవడం జీవితం ఒక సర్కిల్ పూర్తైనట్టుంది. ఆయన చాలా సరదాగా ఉంటారు’ అంటూ తెలిపింది. భాషలపై అడిగిన ఓ ప్రశ్నకు రాశీ ఆసక్తికరంగా స్పందించింది. ‘తెలుగులో నటించాల్సి వచ్చినప్పుడు మొదట భయపడ్డాను. కానీ భయమే పెద్ద అడ్డంకి. తప్పులు మాట్లాడినా తెలుగులోనే మాట్లాడేదాన్ని. నేర్చుకోవాలనే తపన ఉండేది. తమిళం, మలయాళం కూడా అలాగే అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఏ భాషనైనా నేర్చుకుని చేయగలననే నమ్మకం ఉంది’ అని వ్యాఖ్యానించింది. స్టార్స్‌తో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ రవితేజ సానుకూల దృక్పథం తనపై ప్రభావం చూపిందని, జూనియర్ ఎన్టీఆర్ నుంచి ప్రతిభే నిలబెడుతుందన్న పాఠం నేర్చుకున్నానని తెలిపింది.
ధనుష్‌తో పని చేయడం తన నటనను మెరుగుపరిచిందని, మెహన్‌లాల్ హవభావాలను క్షణాల్లో మార్చగలరని ప్రశంసించింది. అలాగే పవన్ కల్యాణ్ ఆరా చూసి ఒకసారి డైలాగ్ మర్చిపోయానని గుర్తు చేసుకుంది. త్వరలో విడుదల కానున్న తలాఖోన్ మే ఏక్ మూవీలో విక్రాంత్ మెస్సీతో నటించడం సంతృప్తినిచ్చిందని తెలిపింది. ‘సోషల్ మీడియాలో కనిపించే మెరుపుల కంటే.. సంబంధాల నిజమైన సంబంధాల స్వరూపాన్ని చూపిస్తుంది’ అని తెలిపింది. ఇక విజయాపజయాలు సహజమని రాశీ స్పష్టం చేసింది. ‘హిట్లు, ఫ్లాపులు వస్తుంటాయి. కానీ నా మీద నాకున్న నమ్మకమే నా బలం. పేరు, డబ్బు లక్ష్యాలు కావు. అవి మన పనికి వచ్చే ఫలితాలు మాత్రమే’ అని తేల్చిచెప్పింది.
Read Also :
Toxic Movie Postponed | యష్ ‘టాక్సిక్’కు వార్ సెగ.. సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్
OTT | గంటకు నాలుగు రూపాయలే మాకు మిగిలేది – గుప్పెడంత మనసు రిషి డెబ్యూ మూవీ దర్శకుడి ట్వీట్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



