Trisha | త్రిష మూవీకి ఫైనాన్షియల్ కష్టాలు…సీఎం విజయ్ పర్మిషన్ ఇచ్చినా… కరుప్పు షోస్ క్యాన్సిల్
రిలీజ్ ముంగిట త్రిష కరుప్పు మూవీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గురువారం తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా...ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా రెండు చోట్ల షోస్ క్యాన్సిల్ అయ్యాయి. దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత థియేటర్లలో రిలీజ్ కానున్న మొదటి మూవీకే రిలీజ్ కష్టాలు ఎదురవ్వడం కోలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Entertainment | Published On May 14, 2026, 10.27 am IST
Trisha | దళపతి విజయ్ (Thalapathy vijay) సీఎంగా పదవి చేపట్టిన తర్వాత థియేటర్లలో తొలిసారి త్రిష (Trisha) కరుప్పు మూవీ రిలీజ్ కాబోతుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాకు తమిళనాడులో స్పెషల్ షోస్‌కు విజయ్ టీవీకే ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చింది.జీవోను జారీ చేసింది. తమిళనాడులో బెనిఫిట్‌షోలను గత డీఎంకే ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ కరుప్పుతోనే..అందులోనూ త్రిష మూవీతో ఈ ట్రెండ్ మొదలుకానుండటంతో సినీ లవర్స్ హ్యాపీగా ఫీలయ్యారు.
ప్రీమియర్స్ రద్దు....
తమిళంతో పాటు తెలుగులోనూ సూర్య, త్రిషలకు మంచి క్రేజ్ ఉండటంతో రెండు భాషల్లో గురువారం (మే 14)న భారీ ఎత్తున సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. కానీ రిలీజ్ ముంగిట ఫైనాన్షియల్ కష్టాల కారణంగా కరుప్పు కు పెద్ద షాక్ తగింది.. ఈ మూవీ మార్నింగ్ షోస్ తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సిల్ అయ్యాయి. ఓవర్‌సీస్‌లో ప్రీమియర్స్ పడలేదు.
ఫైనాన్షియల్ ఇష్యూస్...
కరుప్పు కోసం నిర్మాతలు యాభై కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నారట. వాటికి సంబంధించిన క్లియరెన్స్‌లు రాలేదని టాక్. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగానే మార్నింగ్ షోస్ రద్దు అయినట్లు సమచారం. ప్రస్తుతం ఈ సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు జరుగుతున్నాయట. మ్యాట్నీ లేదంటే ఫస్ట్ షోస్ నుంచి కరుప్పు స్క్రీనింగ్ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు కరుప్పు రిలీజ్ ఈ రోజు ఉండకపోవచ్చునని కూడా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
సూర్య ఫ్యాన్స్ నిరాశ...
గత ఏడాది దీపావళికి రిలీజ్ కావాల్సిన కరుప్పు అనివార్య కారణాల వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఆ అడ్డంకులను దాటుకొని ఈ సారైనా మేకర్స్ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి.
షోస్ క్యాన్సిల్ కావడంతో సూర్య ఫ్యాన్స్ కూడా డిసపాయింట్ అవుతున్నారు. సూర్య తమిళంలో మంచి హిట్టు అందుకొని చాలా రోజులే అవుతోంది. కరుప్పు అతడి కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్‌కే ఈ సినిమా అష్టకష్టాలు పడుతుండటంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక





