Sonu Sood | వార్ వేళ వారికి ఉచిత బస.. మరోసారి మంచి మనసు చాటుకున్న రియల్ హీరో సోనూసూద్
Sonu Sood | బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ (Sonu Sood) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. వార్ వేళ దుబాయ్ (Dubai)లో నిలిచిపోయిన వారికి ఉచితంగా వసతి (free stay) ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు.
Sonu Sood | బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూ సూద్ (Sonu Sood) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈ దాడులు గల్ఫ్ మొత్తం వ్యాపించాయి. ఫలితంగా విమానాలు ఎగరడం లేదు. దీంతో వేలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి తనవంతు సాయం అందించేందుకు ముందుకొచ్చారు ఈ రియల్ హీరో. దుబాయ్ (Dubai)లో నిలిచిపోయిన వారికి ఉచితంగా వసతి (free stay) ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఈ సాయం పొందేందుకు ఎలాంటి షరతులూ లేవని స్పష్టం చేశారు. భారత్ మాత్రమే కాదు ఏ దేశానికి చెందిన వారికైనా ఉచితంగా బస ఏర్పాటు చేయనున్నట్లు సోనూసూద్ స్పష్టం చేశారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో మానవత్వమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. సహాయం అవసరమైన వారు తనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా మెసేజ్ పంపితే తన టీమ్ వెంటనే సంప్రదిస్తుందని తెలిపారు. సోనూసూద్ ప్రకటనపై నెటిజన్లు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఆయన సేవా గుణాన్ని కొనియాడుతూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, రీల్ లైఫ్‌లో విలన్ పాత్రల్లో అలరిస్తున్న బాలీవుడ్ స్టార్ నటుడు సోనూ సూద్.. రియల్ లైఫ్‌లో మాత్రం ఎంతో మంది మన్ననలు పొందుతున్నారు. కొవిడ్ లాక్డౌన్ సమయంలో సేవా కార్యక్రమాల ద్వారా అందరి మన్ననలు అందుకున్నారు నటుడు సోనూసూద్. నిస్వార్థ సేవాగుణంతో దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. కష్టకాలంలో ఉన్న అభిమానులు, సామాన్యులకు తనవంతు సాయం చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
https://x.com/SonuSood/status/2029366631663845854
Also Read..
ట్రంప్‌కు ఊరట.. ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా సెనేట్ మద్దతు
ఇరాన్‌పై దాడులకు భారత పోర్టులను వాడుతున్న అమెరికా..? ఫ్యాక్ట్‌చెక్‌తో క్లారిటీ ఇచ్చిన కేంద్రం
సంబంధిత వార్తలు

Petrol Price Hike | బిగ్ అలర్ట్.. భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? లీటరుపై రూ. 28 బాదుడు.. ఎప్పటి నుంచంటే..?
ఏప్రిల్ 23, 2026

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



