త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Shuts Hormuz Again | హ‌ర్మూజ్ మ‌ళ్లీ క్లోజ్‌.. ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Iran Shuts Hormuz Again | ప్ర‌పంచ ఇంధ‌న ర‌వాణాకు కీల‌కంగా ఉన్న హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz)ని ఇరాన్ మ‌ళ్లీ మూసివేసింది.

D

International | Published On Apr 18, 2026, 4.05 pm IST

Iran Shuts Hormuz Again | హ‌ర్మూజ్ మ‌ళ్లీ క్లోజ్‌.. ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం
Advertisement

Iran Shuts Hormuz Again | ప్ర‌పంచ ఇంధ‌న ర‌వాణాకు కీల‌కంగా ఉన్న హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz)ని ఇరాన్ మ‌ళ్లీ మూసివేసింది. అణ్వస్త్ర కార్యక్రమం సహా అన్ని అంశాలపై తమతో తుది ఒప్పందాన్ని కుదుర్చుకునే దాకా ఇరాన్ ఓడరేవుల ముట్టడిని (naval blockade) ఆపేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. వాణిజ్య నౌకల రాకపోకల కోసం హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ప్ర‌క‌టించిన 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌ముందే యూట‌ర్న్ తీసుకుంది.

లెబనాన్ - ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా హర్మూజ్‌ను పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ శుక్ర‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయినప్పటికీ తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా కొనసాగిస్తుండ‌టంతో టెహ్రాన్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. హర్మూజ్‌ జలసంధి మార్గంలో మళ్లీ ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. ఈ విష‌యాన్ని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ (Iran's military command) శనివారం అధికారికంగా ప్రకటించింది. తమ ఓడరేవులను ముట్టడించడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ ఆరోపించింది. ఈ ముట్టడిని అమెరికా కొనసాగించినన్ని నాళ్లు, హర్మూజ్ ముట్టడిని తాము కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.

Also Read..

సీఎం ఇంటి ముట్ట‌డి ఉద్రిక్తం.. బీజేపీ మ‌హిళా మోర్చా నేత‌ల అడ్డ‌గింత‌

బ‌య‌ట‌కు వ‌స్తున్న సింహం.. గుంట న‌క్క‌ల గుండెల్లో ప‌రుగెడుతున్న రైళ్లు : కేటీఆర్

ఎల్‌పీజీ ధ‌ర‌లు త‌గ్గుతాయా..?

Advertisement
Advertisement