US Using Indian Ports to attack Iran | ఇరాన్‌పై దాడులకు భారత పోర్టులను వాడుతున్న అమెరికా..? ఫ్యాక్ట్‌చెక్‌తో క్లారిటీ ఇచ్చిన కేంద్రం
US Using Indian Ports to attack Iran | ఇరాన్‌పై దాడి చేసేందుకు భారత ఓడరేవులను అమెరికా ఉపయోగిస్తోందంటూ (US Using Indian Ports to attack Iran) ఇప్పుడు తెగ ప్రచారం జరుగుతోంది. దీనిపై భారత్ తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆ వార్తలను ఖండించింది.
US Using Indian Ports to attack Iran | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌పై దాడి చేసేందుకు భారత ఓడరేవులను అమెరికా ఉపయోగిస్తోందంటూ (US Using Indian Ports to attack Iran) ఇప్పుడు తెగ ప్రచారం జరుగుతోంది. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా భారత నౌకాదళ స్థావరాలను ఉపయోగించుకుంటోందని యుఎస్ మాజీ అధికారి డగ్లస్ మాక్‌గ్రెగర్ (Douglas Macgregor) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై భారత్ తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆ వార్తలను ఖండించింది.
దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ (Ministry of External Affairs) ఫ్యాక్ట్ చెక్ (FactCheck) చేపట్టింది. అవన్నీ తప్పుడు, నకిలీ వ్యార్తలను తేల్చింది. ఇలాంటి నిరాధారమైన, కల్పిత వ్యాఖ్యలను నమ్మొద్దని హెచ్చరించింది. ఈ సందర్భంగా మధ్యప్రాచ్యంలో సంఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని సూచించింది. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
కాగా, యూఎస్ మాజీ అధికారి డగ్లస్ మాక్‌గ్రెగర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా దాడుల్లో తమ స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయని తెలిపారు. అందుకే భారత్ ఓడరేవులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఇరాన్‌పై దాడులు జరిపేందుకు భారత ఓడరేవులను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే విదేశాంగ ఫ్యాక్ట్ చెక్‌తో ఆ వార్తలకు చెక్ పెట్టింది.
భారత్ నుంచి వెళ్తుండగా ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి..
కాగా, హిందూ మహాసముద్రంలో మౌడ్జ్ క్లాస్ ఫ్రిగేట్‌కు చెందిన ఇరాన్ యుద్ధనౌక 'ఐఆర్ఐఎస్ దేనా' (IRIS Dena)పై అమెరికా దాడి చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో నావికా విన్యాసాలు ముగించుకుని స్వదేశానికి పయనమైన ఇరాన్ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి (US Submarine) అమాంతం సముద్రంలో ముంచేసింది. దాడి సమయంలో అందులో 180 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో కొందరిని శ్రీలంక నేవీ కాపాడగా.. సుమారు 80 మందికిపైగా నావికులు జలసమాధి అయ్యారు. ఫిబ్రవరి 16న భారత నావికాదళం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జరిగే అతిపెద్ద నావికా విన్యాసాలలో ఒకటైన 'మిలాన్ 2026' సముద్ర భద్రత, యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్, ఎయిర్ డిఫెన్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి కీలక ఆపరేషన్లపై దృష్టి సారించింది. ఇంతటి ముఖ్యమైన విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న నౌకను అమెరికా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఇరాన్ నుంచి భారత్‌కు వస్తున్నప్పటి నుంచే అమెరికా జలాంతర్గామి ఈ నౌకను ట్రాక్ చేస్తూ ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read..
Iran postpones Khameneis funeral | ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ప్రకటించిన ఇరాన్
Virosh Wedding | సెలబ్రేషన్స్ ముగిశాయి.. ఇక అండర్‌గ్రౌండ్‌కే : విజయ్ దేవరకొండ
Nitish Kumar | రాజ్యసభ బరిలో నితీశ్ కుమార్.. 11.30 గంటలకు నామినేషన్ వేయనున్న బీహార్ సీఎం!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన
- ●Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు మరింత బలోపేతం చేస్తున్నాం
- ●El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!
- ●Venkatesh Son | వెంకటేష్ వారసుడు వచ్చేస్తున్నాడోచ్ - దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో?
- ●Man Sleeping on Bull | నడి రోడ్డుపై ఎద్దు ఒడిలో హాయిగా నిద్ర.. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ బ్రో.. వీడియో వైరల్
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కండి

Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన

Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు మరింత బలోపేతం చేస్తున్నాం

El Nino Impact Telangana | ఎల్‌నినో టెన్షన్ వద్దు.. ఈ పంటలే ముద్దు!

Venkatesh Son | వెంకటేష్ వారసుడు వచ్చేస్తున్నాడోచ్ - దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో?






