Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే మాకంటే ఎక్కువగా దాడి చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. మేము ఫైటింగ్ విషయంలో ఎలా ఉంటామో ప్రపంచానికి తెలుసు.. అంటూ ట్రంప్ ట్రుత్ సోషల్‌లో రాసుకొచ్చారు.
International | Published On Apr 15, 2026, 5.58 pm IST
Donald Trump | ఓవైపు యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. ఇరాన్‌కు అంత శక్తిమంతమైన, అత్యాధునికమైన ఆయుధాలు ఎక్కడివి. పవర్‌పుల్ డ్రోన్స్ ఎక్కడివి? భారీ లక్ష్యాన్ని ఛేదించే మిస్సైల్స్ ఎక్కడివి? వాళ్లకు చైనా పంపిస్తోంది కాబట్టే.. వాళ్లు యూఎస్, ఇజ్రాయెల్‌ని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారంటూ అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ట్రంప్ తాజాగా ట్రుత్ సోషల్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

ఇప్పటి వరకు చైనా.. టెహ్రాన్‌కు భారీగా ఆయుధాలను సప్లై చేసింది కానీ.. ఇక నుంచి చేయదు. ఇక ఇరాన్‌కు ఆయుధాలు సప్లై చేయమని చైనా అంగీకరించింది. నిజానికి చైనా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా ఓపెన్ చేస్తున్నా. ఇక నుంచి హార్ముజ్ వద్ద ఎలాంటి సమస్య ఉండదు. దాన్ని నేను చైనా కోసం ఓపెన్ చేస్తున్నా. చైనాతో పాటు ప్రపంచ దేశాల కోసం కూడా ఓపెన్ చేస్తున్నా. ఇలాంటి పరిస్థితి మళ్లీ ఎప్పుడూ రాదు. వాళ్లు ఇరాన్‌కి వెపన్స్ పంపించమని చెప్పారు. నేను కొన్ని వారాల్లో చైనా వెళ్తున్నాను. అప్పుడు చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ నన్ను చూడగానే నా దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంటాడు. మేము కలిసి పని చేస్తున్నాం. స్మార్ట్‌గా చేస్తున్నాం. అలా అని చెప్పి మేము అన్నీ మూసుకొని కూర్చోం. మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే మాకంటే ఎక్కువగా దాడి చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. మేము ఫైటింగ్ విషయంలో ఎలా ఉంటామో ప్రపంచానికి తెలుసు.. అంటూ ట్రంప్ ట్రుత్ సోషల్‌లో రాసుకొచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.
తాజావార్తలు
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!
- ●Trisha | ఎనిమిదేళ్ల తర్వాత హారర్ మూవీలో త్రిష - పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు చెన్నై క్వీన్ చెక్
- ●Gadwal Vijayalakshmi | సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : గద్వాల్ విజయలక్ష్మి
- ●Chanchalguda to Santoshnagar Flyover | పాతబస్తీ ట్రాఫిక్ కష్టాలకు చెక్: చంచల్‌గూడ - సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్
- ●BJP Malka Komaraiah | ఫీజులు అడిగితే అరెస్టులు చేస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు

Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్

Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Trisha | ఎనిమిదేళ్ల తర్వాత హారర్ మూవీలో త్రిష - పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు చెన్నై క్వీన్ చెక్

Gadwal Vijayalakshmi | సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : గద్వాల్ విజయలక్ష్మి






