Sonali Bendre | చిక్కుల్లో నటి సోనాలి బింద్రే.. తన భూమిని కబ్జా చేశారంటూ రైతు ఫిర్యాదు
Sonali Bendre | బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలి బింద్రే (Sonali Bendre) చిక్కుల్లో పడ్డారు. నటి, ఆమె భర్త గోల్డీ బెహల్ (Goldie Behl) భూ వివాదంలో (Land Fraud) చిక్కుకున్నారు. పూణే (Pune) జిల్లా లోనావాలా సమీపంలోని ఉక్సాన్ గ్రామంలో ఉన్న తన భూమిని ఆక్రమించారంటూ రైతు చంద్రకాంత్ షిండే ఆరోపించారు.
Sonali Bendre | బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలి బింద్రే (Sonali Bendre) చిక్కుల్లో పడ్డారు. నటి, ఆమె భర్త గోల్డీ బెహల్ (Goldie Behl) భూ వివాదంలో (Land Fraud) చిక్కుకున్నారు. పూణే (Pune) జిల్లా లోనావాలా సమీపంలోని ఉక్సాన్ గ్రామంలో ఉన్న తన భూమిని ఆక్రమించారంటూ రైతు చంద్రకాంత్ షిండే ఆరోపించారు. సోనాలి బింద్రే దంపతులు తన భూమి పక్కనే ఆస్తిని కొనుగోలు చేశారని.. ఆ తర్వాత తన 30 గుంటల భూమిలోకి చొరబడి కంచె వేశారని ఆరోపించారు. ఈ భూమిపై తమ కుటుంబానికి 1957 నుంచే వంశపారంపర్యంగా హక్కులు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలంటూ రైతు వడ్గావ్ మావల్ సివిల్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే తమను బెదిరించారని కూడా సదరు రైతు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అయితే, ఈ ఆరోపణలను నటి సోనాలి బింద్రే తీవ్రంగా ఖండించారు. ఇదంతా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నమని స్పష్టం చేశారు. రైతు ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. చట్టబద్ధంగానే ఆ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేవలం సెలబ్రిటీ అయినందున, డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతోనే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సోనాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఫిర్యాదు మేరకు పూణె గ్రామీణ పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి.. భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. సర్వే పూర్తైన అనంతరం ఈ వివాదంపై స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు.
Also Read..
న్యాయాధికారుల నిర్బంధం.. దీదీ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేసిన సీజేఐ
ఇరాన్ పునర్నిర్మాణానికి కదిలి రావాలి.. ప్రజలకు మొజ్తాబా ఖమేనీ పిలుపు
ఎల్డీఎఫ్ మేనిఫెస్టో రిలీజ్.. కేరళ పట్టభంద్రులందరికీ ఉద్యోగాలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






