త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sharad Pawar | శరద్‌ పవార్‌కు తీవ్ర‌ అస్వస్థత.. ద‌వాఖాన‌కు తరలింపు

Sharad Pawar | రాజ‌కీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ NCP (SP) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) మ‌రోసారి అస్వస్థతకు గురయ్యారు. 85 ఏండ్ల ప‌వార్ ఈ నెల 7న తీవ్రమైన దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్‌తో ద‌వాఖాన‌లో చేరిన విష‌యం తెలిసిందే.

G

National | Published On Feb 22, 2026, 12.15 pm IST

Sharad Pawar | శరద్‌ పవార్‌కు తీవ్ర‌ అస్వస్థత.. ద‌వాఖాన‌కు తరలింపు
Advertisement

Sharad Pawar | త్రినేత్ర‌.న్యూస్‌: రాజ‌కీయ కురువృద్ధుడు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ NCP (SP) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) మ‌రోసారి అస్వస్థతకు గురయ్యారు. 85 ఏండ్ల ప‌వార్ ఈ నెల 7న తీవ్రమైన దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్‌తో ద‌వాఖాన‌లో చేరిన విష‌యం తెలిసిందే. చికిత్స అనంత‌రం వారం క్రితం తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. తాజాగా మ‌రోసారి అనారోగ్యానికి గుర‌వ‌డంతో పుణెలోని రుబీ హాల్ ద‌వాఖాన‌కు తరలించారు. డీహైడ్రేషన్‌తో (Dehydration) బాధపడుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నార‌ని, ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని హాస్పిట‌ల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. డీహైడ్రేష‌న్‌కు గుర‌వ‌డంతో ద‌వాఖాన‌లో చేరార‌ని, మ‌రో రెండు రోజులు హాస్పిట‌ల్‌లోనే ఉంటార‌ని డాక్ట‌ర్ ప‌ర్వేజ్ గ్రాంట్ తెలిపారు. కాగా, ప‌వార్ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే తెలిపారు.

 

ట్యాగ్స్:

Advertisement
Advertisement