త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mojtaba Khamenei | ఇరాన్ పునర్నిర్మాణానికి క‌దిలి రావాలి.. ప్ర‌జ‌ల‌కు మొజ్తాబా ఖ‌మేనీ పిలుపు

Mojtaba Khamenei | అమెరికా, ఇజ్రాయెల్ దురాక్ర‌మ‌ణ కార‌ణంగా దెబ్బ‌తిన్న మౌలిక స‌దుపాయాల‌ను (infrastructure) పునర్నిర్మించడానికి ముందుకు రావాలని ఇరాన్ ప్రజలకు ఆ దేశ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) పిలుపునిచ్చారు.

D

International | Published On Apr 2, 2026, 12.36 pm IST

Mojtaba Khamenei | ఇరాన్ పునర్నిర్మాణానికి క‌దిలి రావాలి.. ప్ర‌జ‌ల‌కు మొజ్తాబా ఖ‌మేనీ పిలుపు
Advertisement

Mojtaba Khamenei | అమెరికా, ఇజ్రాయెల్ దురాక్ర‌మ‌ణ కార‌ణంగా దెబ్బ‌తిన్న మౌలిక స‌దుపాయాల‌ను (infrastructure) పునర్నిర్మించడానికి ముందుకు రావాలని ఇరాన్ ప్రజలకు ఆ దేశ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) పిలుపునిచ్చారు. నేడు ఇస్లామిక్ రిప‌బ్లిక్ డే, ఇరాన్ జాతీయ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఓ సందేశం విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా త‌మ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ అకారణంగా దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులు, నీచమైన దురాక్రమణలను తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల కార‌ణంగా మౌలిక స‌దుపాయాల‌తోపాటూ ప‌ర్యావ‌ర‌ణం కూడా తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అందుకే ప్ర‌జ‌లు ప్ర‌స్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపైనే దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిని విస్తరించడం, ఇరాన్‌ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఇరాన్‌లోని మినాబ్‌ పాఠశాలపై జరిగిన దాడి గురించి మొజ్తాబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో మ‌ర‌ణించిన 186కి నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Also Read..

రూ.167 కోట్లు ప‌లికిన‌ "య‌శోద కృష్ణ" పెయింటింగ్‌.. అత్య‌ధిక ధ‌ర ప‌లికిన చిత్రంగా రికార్డు

అది నా పూర్వ‌జ‌న్మ సుకృతం.. ప్ర‌త్యేక వీడియో షేర్ చేసిన చిరంజీవి

జ్ఞానుల్లో అత్యున్నతుడు అంజనీ సుతుడు: కేసీఆర్

Advertisement

తాజావార్తలు

Advertisement