LDF Manifesto | ఎల్‌డీఎఫ్ మేనిఫెస్టో రిలీజ్.. కేరళ పట్టభద్రులందరికీ ఉద్యోగాలు: సీఎం విజయన్
LDF, UDF Manifestos | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎల్‌డీఎఫ్(LDF), విపక్ష యూడీఎఫ్ (UDF) కూటములు ఓటర్లపై వరాల జల్లు కురిపించాయి. తమతమ మేనిఫెస్టోల(Manifesto)ను తాజాగా విడుదల చేశాయి. ఈ మేరకు సీఎం పినరయి విజయన్ (CM Vijayan) తమ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను కోజికోడ్(Kozhikode) లో ప్రకటించారు. 60 అంశాలతో రెండు వాల్యూమ్లుగా డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.
త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ఎల్‌డీఎఫ్(LDF), విపక్ష యూడీఎఫ్ (UDF) కూటములు ఓటర్లపై వరాల జల్లు కురిపించాయి. తమతమ మేనిఫెస్టోల(Manifesto)ను తాజాగా విడుదల చేశాయి. ఈ మేరకు సీఎం పినరయి విజయన్ (CM Vijayan) తమ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను కోజికోడ్(Kozhikode) లో ప్రకటించారు. 60 అంశాలతో రెండు వాల్యూమ్లుగా డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధే తమ ప్రధాన అజెండా అని సీఎం వివరించారు.
ఎల్‌డీఎఫ్ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు..
. పట్టభద్రులందరికీ ఉద్యోగాలు
. సంక్షేమ పింఛన్లు రూ. 3,000కు పెంపు
. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 60,000 మంది యువతకు ఉపాధి కల్పన
. యువతకు వడ్డీ లేని రుణాల మంజూరు
. మహిళలకు 50 శాతం ఉద్యోగాల కేటాయిుంపు
కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి యూడీఎఫ్ సైతం ఉచిత హామీలు ప్రకటించింది. కర్ణాటక, తెలంగాణ, ఏపీ మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పింది. సంక్షేమ పింఛన్లను రూ. 3,000కు పెంచుతామని పేర్కొంది. విద్యార్థినిలకు నెలకు రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ నాయకుడు వీడీ సతీసన్ గురువారం తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కాగా కేరళలో 140 అసెంబ్లీ స్థానాలున్నాయి. అన్ని స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 9న పోలింగ్ జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.
యూడీఎఫ్ మేనిఫెస్టో..
. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు
. వయనాడ్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు
. సంక్షేమ పింఛన్లను రూ. 3,000కు పెంపు
. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా పథకం
. చిన్న వ్యాపారులకు రూ. 5 లక్షల వడ్డీ లేని రుణం
. ఆశా, అంగన్‌వాడీ కార్మికుల వేతనాల సవరణ
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






