Maa Inti Bangaram | మెగాస్టార్ ఇంట “బంగారం” సందడి.. సామ్ జంటకు చిరు దంపతుల సత్కారం
Maa Inti Bangaram | సమంత తన భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో కలిసి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంట సందడి చేశారు.
Maa Inti Bangaram | సమంత హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ మా ఇంటి బంగారం (Maa Inti Bangaram) బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. మూడు సంవత్సరాల విరామం తర్వాత సమంత చేసిన ఈ కమ్‌బ్యాక్ మూవీ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. సమంత కెరీర్‌లోనే కాకుండా తెలుగులో ఇప్పటివరకు వచ్చిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. సమంత ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా సామ్ తన భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో కలిసి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంట సందడి చేశారు.
చిరంజీవి మంచి సినిమాలను ప్రోత్సహించడంలో ముందుంటారు. అలా తాజాగా రిలీజైన మా ఇంటి బంగారం చిత్ర బృందాన్ని చిరంజీవి, సురేఖ దంపతులు తమ ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు నిన్న సాయంత్రం సమంత, రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ అయినందుకు అభినందనలు తెలిపారు. ఇక పెళ్లైన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చిన సామ్ జంటకు చిరంజీవి దంపుతులు నూతన వస్త్రాలు అందజేశారు. దాంతోపాటు కొన్ని బహుమతులు కూడా ఇచ్చారు. ఇక చిరంజీవి దంపతులకు సామ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా మోషన్ పిక్చర్స్ పతాకంపై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత ఈ సినిమాను నిర్మించింది. గుల్షన్ దేవయ్య, దిగంత్, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో నక్సలైట్, పెద్దింటి కోడలిగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో సమంత అదరగొట్టింది. మా ఇంటి బంగారం సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతో దాదాపు మూడేళ్ల తర్వాత హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది సమంత.
కాగా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే మా ఇంటి బంగారం ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. జియో హాట్‌స్టార్‌లో ఈ క్రైమ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. నాలుగు వారాల్లోనే సమంత మూవీ ఓటీటీలోకి రానున్నట్లు చెబుతున్నారు. జూలై 17 లేదా 24న ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
A MEGA BANGAARAM MOMENT ✨
Megastar @KChiruTweets Garu and #Surekha Garu appreciated the entire team of #MaaIntiBangaaram on the special success ❤️
Watch the BLOCKBUSTER 𝐒𝐀𝐌BHAVAM #MaaIntiBangaaram in theatres today ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/P89ifZn9Ss… pic.twitter.com/g5tKmIp5bS— Tralala Moving Pictures (@TralalaPictures) June 22, 2026
Also Read..
దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులు
నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రెసిడెంట్
ప్లాస్టిక్ డ్రమ్ములో ఇరుక్కుపోయిన ఆవు తల.. ఓ నిమిషం ఆగమాగం.. వీడియో
తాజావార్తలు
- ●Basara Temple | బాసర ఆలయంలో భారీ చోరీ.. అమ్మవారి కిరీటం ఎత్తుకెళ్లిన దొంగలు
- ●Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
- ●Telegram | టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం
- ●George Kurian | కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా
- ●Samantha | చిరు లీక్స్ - సమంత జీవితంలోని గుడ్ న్యూస్‌ను బయటపెట్టిన మెగాస్టార్
- ●Oracle layoffs | ఏఐ ఎఫెక్ట్.. 12 నెలల్లో 21,000 మందిని తొలగించిన ఒరాకిల్.. భవిష్యత్తులో మరిన్ని కోతలు

Basara Temple | బాసర ఆలయంలో భారీ చోరీ.. అమ్మవారి కిరీటం ఎత్తుకెళ్లిన దొంగలు

Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..

Telegram | టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం

George Kurian | కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా





