Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ శాంతి చర్చల దిశగా పురోగతి సాధిస్తున్నప్పటికీ అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో మాత్రం సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా ఏఐ కారణంగా ఐటీ కంపెనీల స్టాక్స్ భారీగా పతనమవుతుండడం ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. దీంతో పెట్టుబడిదారులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్ శాంతి చర్చల దిశగా పురోగతి సాధిస్తున్నప్పటికీ అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో మాత్రం సందిగ్ధత నెలకొంది. ముఖ్యంగా ఏఐ కారణంగా ఐటీ కంపెనీల స్టాక్స్ భారీగా పతనమవుతుండడం ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. దీంతో పెట్టుబడిదారులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదే ప్రభావం బులియన్ మార్కెట్‌పైనా పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఔన్స్ బంగారం ధర 1.74 శాతం మేర పతనమై 4,118 డాలర్లకు చేరగా, వెండి ధర 3.77 శాతం తగ్గి 62 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1,815 పాయింట్లు తగ్గి 1,46,303 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 6,735 పాయింట్లు పడిపోయి 2,27,489 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ ఈ ప్రభావం కనిపించింది. బంగారం ధరలు భారీగా పడిపోగా, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,591 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,16, 728 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,45,910 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,59,100 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.20,700 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,375 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,07,000గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,33,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,37,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.19,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,944 ఉండగా, 8 గ్రాముల ధర రూ.87,552గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,09,440 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,94,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.15,500 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
జూన్ 22, 2026

Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమేంటి..?
జూన్ 20, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.36వేలు తగ్గిన బంగారం ధర.. కొనుగోళ్లకు చాన్స్ వచ్చిందా..?
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..
- ●Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? - సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష
- ●Vijay-Trisha | విజయ్ - త్రిష బంధానికి బ్రేకప్ పడిందా..? నెట్టింట కొత్త చర్చ
- ●Micro Plastics | తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఆర్వో ప్యూరిఫైయర్స్ అవసరం అంటున్న నిపుణులు..
- ●Basara Temple | బాసర ఆలయంలో భారీ చోరీ.. అమ్మవారి కిరీటం ఎత్తుకెళ్లిన దొంగలు
- ●Telegram | టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం

ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..

Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? - సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష

Vijay-Trisha | విజయ్ - త్రిష బంధానికి బ్రేకప్ పడిందా..? నెట్టింట కొత్త చర్చ

Micro Plastics | తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఆర్వో ప్యూరిఫైయర్స్ అవసరం అంటున్న నిపుణులు..



