Padma Awards 2026 | నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రెసిడెంట్
Padma Awards 2026 | దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరిగే రెండో సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో మొత్తం 65 మంది అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందజేయనున్నారు.
Padma Awards 2026 | దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరిగే రెండో సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో మొత్తం 65 మంది అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందజేయనున్నారు. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ విడతలో రెండు పద్మ విభూషణ్‌లు, ఏడు పద్మ భూషణ్‌లు, 56 పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయనున్నారు. మే 25న జరిగిన తొలి సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో రాష్ట్రపతి మరో 65 మంది అవార్డు గ్రహీతలను సత్కరించిన విషయం తెలిసిందే.
దేశానికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలు తదితర విభాగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాలు అందజేస్తారు. అత్యున్నత స్థాయి అసాధారణ సేవలకు ‘పద్మ విభూషణ్’, విశిష్ట సేవలకు ‘పద్మ భూషణ్’, ఏ రంగంలోనైనా ప్రత్యేక సేవలకు ‘పద్మశ్రీ’ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈసారి పద్మ భూషణ్‌కు ఎంపికైన ప్రముఖుల్లో దివంగత కేంద్ర మాజీ మంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కేంద్రం అవార్డును ప్రకటించింది. ఆయనకు మరణానంతరం పద్మ భూషణ్ పురస్కారం ప్రదానం చేయనున్నారు. సాహిత్యం, విద్యా రంగంలో పీ నారాయణన్, పబ్లిక్ అఫైర్స్ కేటగిరిలో రిటైర్డ్ న్యాయమూర్తి కేటీ థామస్‌కు పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకోనున్నారు. అలాగే, ప్రముఖ టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్, ప్రముఖ మలయాళ నటుడు మమ్మూటీ, సింగర్ అల్కా యాగ్నిక్, ఎస్‌కేఎం మైలానందన్, వెల్లపల్లి నటేశన్, డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు తదితరులు పద్మభూషణ్ అవార్డును అందుకోఉన్నారు. అలాగే, ప్రొఫెసర్ ప్రతీక్ శర్మకు మెడిసిన్ విభాగంలో పద్మశ్రీ పురస్కారం దక్కింది. రష్యాకు చెందిన
రష్యాకు చెందిన లియుడ్మిలా ఖోఖో సాహిత్యం, విద్యా రంగంలో పద్మశ్రీకి ఎంపికయ్యారు. జార్జియాకు చెందిన దివంగత క్రీడాకారుడు వ్లాదిమిర్ మెస్ట్‌విరిష్విలికు క్రీడల విభాగంలో మరణానంతరం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేయనున్నారు. అలాగే, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రొఫెసర్ మహేంద్రనాథ్ రాయ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో చేసిన విశిష్ట కృషికి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన దేశ, విదేశీ ప్రముఖులను సత్కరించేందుకు రాష్ట్రపతి భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Norway vs Senegal | నాకౌట్లోకి నార్వే
- ●Cow | ప్లాస్టిక్ డ్రమ్ములో ఇరుక్కుపోయిన ఆవు తల.. ఓ నిమిషం ఆగమాగం.. వీడియో
- ●ICC | మాతృత్వం ఇక అడ్డంకి కాదు.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భరోసా..!
- ●Family Suicide | పెళ్లికి ముందు రోజు.. వధువుతో పాటు ఉరేసుకున్న తల్లిదండ్రులు
- ●France vs Iraq | ఎంబాప్పే మ్యాజిక్
- ●Qatar | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు మృతి









