త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oracle layoffs | ఏఐ ఎఫెక్ట్‌.. 12 నెల‌ల్లో 21,000 మందిని తొల‌గించిన ఒరాకిల్‌.. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కోత‌లు

Oracle layoffs | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేసే క్రమంలో భాగంగా అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఒరాకిల్ (Oracle) 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల తొలగింపులు (layoffs) ఉంటాయ‌ని వెల్ల‌డించింది.

D

National | Published On Jun 23, 2026, 10.31 am IST

Oracle layoffs | ఏఐ ఎఫెక్ట్‌.. 12 నెల‌ల్లో 21,000 మందిని తొల‌గించిన ఒరాకిల్‌.. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కోత‌లు
Advertisement

Oracle layoffs | టెక్‌ రంగంలో అనిశ్చితి కొనసాగుతోంది. కృత్రిమ మేధ (AI) ప్రవేశం, దేశాల మధ్య నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వెరసి ప్రపంచవ్యాప్తంగా ఐటీ (IT) సెక్టార్‌ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. చిన్న కంపెనీల నుంచి మొదలుకొని దిగ్గజ టెక్ సంస్థల వరకు అన్నీ తమ కార్యకలాపాల్లో ఏఐని భాగం చేస్తూ.. మానవ వనరుల్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. ఫ‌లితంగా వేలాది మంది టెకీలు త‌మ ఉద్యోగాల‌ను కోల్పోవాల్సి వ‌స్తోంది.

ఇప్ప‌టికే దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్ స‌హా గూగుల్, మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌, అమెజాన్‌, హెచ్‌పీ, యాపిల్‌, మెటా.. వంటి పెద్దపెద్ద సంస్థలు ఖర్చు తగ్గించుకునేందుకు ఎడాపెడా ఉద్యోగులను తొలగించాయి. అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఒరాకిల్ (Oracle) సైతం భారీ స్థాయిలో ఉద్యోగాల‌ను కోత పెట్టింది. గ‌డిచిన 12 నెల‌ల్లోనే 21వేల మందిని తొల‌గించింది. తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాలను కంపెనీ వెల్లడించింది.

13 శాతం త‌గ్గిన ఉద్యోగుల సంఖ్య‌..

సంస్థ నిర్ణ‌యంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 13 శాతం మేర త‌గ్గింది. గ‌తేడాది సుమారు 1,62,000 గా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది మే 31 నాటికి 1,41,000 కు పడిపోయింది. ఇందులో 49,000 మంది అమెరికా ఉద్యోగులు కాగా, అంత‌ర్జాతీయంగా దాదాపు 92 వేల మంది ప‌నిచేస్తున్నారు.

భ‌విష్య‌త్తులో మ‌రిన్ని కోత‌లు..

త‌మ కార్య‌క‌లాపాల్లో కృత్రిమ మేధను భాగం చేయడంతో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చిందని సంస్థ తెలిపింది. అంతేకాదు, భ‌విష్య‌త్తులో కూడా మ‌రిన్ని కోత‌లు కొన‌సాగుతాయ‌ని వెల్ల‌డించింది.

ఏఐ కోసం..

ఓపెన్ఏఐ (OpenAI) సంస్థతో ఒరాకిల్ 300 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదగాలనే ఉద్దేశంతో ఒరాకిల్ భారీగా డేటా సెంటర్లను నిర్మిస్తోంది. ఇందుకు చాలా ఖ‌ర్చ‌వుతుంది. ఏఐ కోసం మౌలిక స‌దుపాయాలు క‌ల్పించేందుకు సంస్థ‌కు దాదాపు 156 బిలియిన్ డాల‌ర్లు అవ‌స‌రం ఉంది. అందుకోసం నిధులు స‌మ‌కూర‌డం లేదు. ఫ‌లితంగా సంస్థ ఉద్యోగుల‌కు లేఆఫ్స్ ఇస్తోంది. ఈ లేఆఫ్స్‌తో కొంత ఆదా చేయొచ్చ‌ని సంస్థ భావిస్తోంది.

Also Read..

వాట్సాప్‌లో కొత్త మాల్‌వేర్ ముప్పు.. ఈ ఫైళ్ల‌ను ఓపెన్ చేస్తే మీ కంప్యూటర్ హ్యాకర్ల చేతిలో..

భారీగా ప‌త‌న‌మైన ఐటీ షేర్లు.. అమ్మ‌కాల ఒత్తిడిలో సూచీలు..

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు.. అమెరికాపై ఘాటు విమర్శలు

Advertisement
Advertisement