Basara Temple | బాసర ఆలయంలో భారీ చోరీ.. అమ్మవారి కిరీటం ఎత్తుకెళ్లిన దొంగలు
Basara Temple | నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి (Gnana Saraswati) అమ్మవారి ఆలయంలో (Basara Temple) భారీ చోరీ జరిగింది. ఆలయం పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతోపాటూ హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు.
Basara Temple | నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి (Gnana Saraswati) అమ్మవారి ఆలయంలో (Basara Temple) భారీ చోరీ జరిగింది. సరస్వతి అమ్మవారి ఆలయంలో పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతోపాటూ హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆలయ తలుపులు పగలగొట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. హుండీలోని నగదు కాజేసి దాన్ని వ్యాసగుడి వద్ద వదిలేసి పారిపోయారు.
మంగళవారం తెల్లవారుజామున ఆలయ పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చిన ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ గుడి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఈ విషయాన్ని ఆలయ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన అధికారులు దొంగతనం జరిగిందన్న విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పూజారి చేత ఆలయ తలుపులు తెరిపించి లోపలికి వెళ్లి చూశారు. అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతోపాటూ హుండీ అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం భక్తుల రద్దీతో కలకలలాడే ఆలయంలో చోరీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
- ●Ponnam Prabhakar | భూములు విక్రయించైనా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Road Accident | వాకింగ్కు వెళ్లిన ముగ్గురిని ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు దుర్మరణం
- ●Stock Markets | భారీ లాభాల తర్వాత మార్కెట్లకు బ్రేక్.. స్వల్ప నష్టాల్లో సూచీలు..
- ●Manne Krishank | ఒకటి కాదు.. మూడు ఆధారాలు చూపిస్తం.. చర్చకు సిద్ధమా?: రేవంత్ రెడ్డికి మన్నె క్రిశాంక్ సవాల్
- ●All Party Meeting | నేడు జరగాల్సిన అఖిలపక్ష సమావేశం వాయిదా

KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్

Ponnam Prabhakar | భూములు విక్రయించైనా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Road Accident | వాకింగ్కు వెళ్లిన ముగ్గురిని ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు దుర్మరణం

Stock Markets | భారీ లాభాల తర్వాత మార్కెట్లకు బ్రేక్.. స్వల్ప నష్టాల్లో సూచీలు..






