త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?

Ramchandar Rao | మెగాస్టార్, ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు గ్ర‌హీత చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చిరంజీవితో ఆయ‌న నివాసంలో సోమ‌వారం భేటీ అయ్యారు. ప్రధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో వికాస్, విశ్వాస్, జన కళ్యాణ్‌తో 12 ఏళ్ల పాలన పూర్త‌యిన సందర్భంగా మెగాస్టార్‌ను క‌లిసిన‌ట్లు తెలిపారు.

S

Telangana | Published On Jun 22, 2026, 1.40 pm IST

Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?
Advertisement
  • చిరు నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు ఆస‌క్తిక‌ర భేటీ
  • సినీ, రాజ‌కీయ వర్గాల్లో జోరుగా చ‌ర్చ‌

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: మెగాస్టార్, ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు గ్ర‌హీత చిరంజీవితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు చిరంజీవితో ఆయ‌న నివాసంలో సోమ‌వారం భేటీ అయ్యారు. ప్రధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో వికాస్, విశ్వాస్, జన కళ్యాణ్‌తో 12 ఏళ్ల పాలన పూర్త‌యిన సందర్భంగా మెగాస్టార్‌ను క‌లిసిన‌ట్లు తెలిపారు. మోదీ పాలన విజయాలను ప్రజలకు చేరవేసే ‘విశేష్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగానే సినీ, వ్యాపార ప్రముఖులతో వ‌రుసగా భేటీ అవుతున్న‌ట్లు రాంచందర్​రావు వెల్ల‌డించారు. మోదీ ప్రభుత్వ కీలక విజయాలు, మైలురాళ్లను వివరించే బుక్‌లెట్‌ను, బ్రోచర్లను ఆయనకు అందజేసిన‌ట్లు పేర్కొన్నారు. కాగా ఈ భేటీ నేప‌థ్యంలో చిరంజీవి బీజేపీలో చేర‌బోతున్నారంటూ సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

దేశ ఆర్థిక పురోగతి, వివిధ రంగాల అభివృద్ధిపై ఇద్ద‌రి మధ్య చర్చ కొన‌సాగినట్లు ఆయ‌న వివ‌రించారు. ప్రభుత్వ విజయాలను వివరించడానికే మెగాస్టార్‌ను కలిసిన‌ట్లు తేల్చిచెప్పారు. సినిమాలు, సమాజం ఇంకా దేశ నిర్మాణం గురించి ఎంతో స్ఫూర్తిదాయకమైన చర్చ చేసిన‌ట్లు పేర్కొన్నారు. మోదీ సేవా కాలం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు. అనంత‌రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ బి.ఆర్.నాయుడును క‌లిసి బుక్‌లెట్‌ను అందజేసిన్లు చెప్పారు.

అయితే హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో జ‌రిగిన ఈ భేటీ సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస్త‌కిని రేపుతోంది. మెగాస్టార్ బీజేపీలో చేరబోతున్నార‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. త‌మ‌ భేటీ మోదీ ప్రభుత్వ విజయాలను వివరించడానికేనని రాంచంద‌ర్‌రావు చెబుతున్న‌ప్ప‌టికీ రాజకీయ వర్గాల్లో మాత్రం సరికొత్త చర్చకు తెరలేపిన‌ట్ల‌యింది. గతంలో ప్ర‌జారాజ్యం పార్టీతో రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించిన చిరంజీవి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అనంత‌రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్డీఏ (NDA) కూటమిలో భాగస్వామిగా ఉండటంతో తాజా సమీకరణాలకు బ‌లం చేకూరుతోంది. చిరంజీవి కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని సోష‌ల్‌మీడియాలో చ‌ర్చ‌లు ఊపందుకోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, కార్యదర్శులు భరత్ గౌడ్, విజయ్ బండారు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement