Samantha | చిరు లీక్స్ – సమంత జీవితంలోని గుడ్ న్యూస్‌ను బయటపెట్టిన మెగాస్టార్
సమంత తల్లి కాబోతుంది. ఈ గుడ్‌న్యూస్‌ను మెగాస్టార్ చిరంజీవి బయటపెట్టారు. మా ఇంటి బంగారం సక్సెస్‌ను పురస్కరించుకొని చిరంజీవిని ఆయన నివాసంలో సమంత, రాజ్ నిడిమోరు కలిశారు. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈ సినిమాకు రివ్యూ కూడా ఇచ్చారు చిరంజీవి. అంతే కాకుండా సమంత తల్లి కాబోతున్నట్లు కూడా చిరంజీవి వెల్లడించారు.
Entertainment | Published On Jun 23, 2026, 11.13 am IST
Samantha హీరోయిన్ సమంత తల్లి కాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత బేబీ బంప్‌తో కనిపించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై సమంతతో పాటు ఆమె భర్త రాజ్ నిడిమోరు మాత్రం రియాక్ట్ కాలేదు.
చిరంజీవి అభినందనలు...
తాజాగా సమంత తల్లి కాబోతున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి బయటపెట్టారు. మా ఇంటి బంగారం విజయాన్ని పురస్కరించుకొని చిత్రబృందాన్ని చిరంజీవి అభినందించారు. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాను చూసిన ఇంప్రెస్ అయిన మెగాస్టార్ ....సమంత, రాజ్ నిడిమోరుతో పాటు దర్శకురాలు నందిని రెడ్డిలను తన నివాసానికి ఆహ్వానించారు. టీమ్ తో చాలా సేపు ముచ్చటించారు. వారిపై ప్రశంసలు కురిపించారు.
చీరకట్టులో...
అంతే కాకుండా మా ఇంటి బంగారం మూవీకి మెగాస్టార్ చిరంజీవి రివ్యూ కూడా ఇచ్చారు. "మా ఇంటి బంగారం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో సినిమాను తెరకెక్కించారు. సమంత నటన, ముఖ్యంగా చీరకట్టులో ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇలాంటి వైవిధ్యమైన, మహిళా ప్రాధాన్య చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు అవసరం. పెద్ద విజయాన్ని సాధించిన సమంత, నందిని రెడ్డి, రాజ్‌తో పాటు చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు" అని సోషల్ మీడియాలో చిరంజీవి ఓ పోస్ట్ పెట్టారు.
కొత్త అధ్యాయాన్ని....
అంతే కాకుండా సమంత తల్లి కాబోతున్న సంగతిని చిరంజీవి బయటపెట్టారు. "జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత , రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు" అంటూ తన పోస్ట్‌లో చిరంజీవి పేర్కొన్నారు. సమంత,రాజ్ ప్రెగ్నెన్సీ న్యూస్‌ను త్వరలో అభిమానులతో ప్రత్యేకంగా పంచుకోవాలని అనుకున్నారట. కానీ వారి కంటే ముందే మెగాస్టార్ లీక్ చేసేశారు. సమంతకు అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరోవైపు చిరంజీవి ట్వీట్ వైరల్ అవుతోంది.
“మా ఇంటి బంగారం“ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. @Samanthaprabhu2 నటన, ముఖ్యంగా చీరకట్టులో చేసిన యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.… pic.twitter.com/eE5xemjh3c
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 23, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Maa Inti Bangaram | మెగాస్టార్ ఇంట “బంగారం” సందడి.. సామ్ జంటకు చిరు దంపతుల సత్కారం
జూన్ 23, 2026

Tollywood | ఒక్క లిప్‌లాక్ లేదు .. అయినా “ఏ” సర్టిఫికెట్ ఇచ్చారు – సెన్సార్ తీరుపై దీవాన టీమ్ ఫైర్
జూన్ 22, 2026

Tollywood | వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ అంటూ మోసాలు – క్లారిటీ ఇచ్చిన టీమ్
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..
- ●Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? - సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష
- ●Vijay-Trisha | విజయ్ - త్రిష బంధానికి బ్రేకప్ పడిందా..? నెట్టింట కొత్త చర్చ
- ●Micro Plastics | తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఆర్వో ప్యూరిఫైయర్స్ అవసరం అంటున్న నిపుణులు..
- ●Basara Temple | బాసర ఆలయంలో భారీ చోరీ.. అమ్మవారి కిరీటం ఎత్తుకెళ్లిన దొంగలు
- ●Gold And Silver Prices Today | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..

ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..

Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? - సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష

Vijay-Trisha | విజయ్ - త్రిష బంధానికి బ్రేకప్ పడిందా..? నెట్టింట కొత్త చర్చ

Micro Plastics | తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఆర్వో ప్యూరిఫైయర్స్ అవసరం అంటున్న నిపుణులు..



