Maa Inti Bangaram | సమంత మా ఇంటి బంగారం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే – స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సమంత మా ఇంటి బంగారం ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. జూలై 17 లేదా 24న మా ఇంటి బంగారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Entertainment | Published On Jun 21, 2026, 2.42 pm IST
Maa Inti Bangaram | సమంత హీరోయిన్‌గా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. రెండు రోజుల్లోనే 25 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. సమంత కెరీర్‌లోనే కాకుండా తెలుగులో ఇప్పటివరకు వచ్చిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే 13 కోట్ల వరకు వసూళ్లను సాధించిన ఈ సినిమా రెండో రోజు 12 కోట్లు రాబట్టింది. ఆదివారం రోజు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వరల్డ్ వైడ్‌గా పదకొండు కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మా ఇంటి బంగారం రిలీజైంది. రెండు రోజుల్లోనే యాభై శాతానికిపైగా రికవరీ సాధించింది. మరో ఒకటి, రెండు రోజుల్లో సమంత సినిమా ప్రాఫిట్స్‌లోకి అడుగుపెట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
జియో హాట్‌స్టార్...
కాగా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే మా ఇంటి బంగారం ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. జియో హాట్‌స్టార్‌లో ఈ క్రైమ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. నాలుగు వారాల్లోనే సమంత మూవీ ఓటీటీలోకి రానున్నట్లు చెబుతున్నారు. జూలై 17 లేదా 24న ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
పెద్దింటి కోడలిగా...
మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా మోషన్ పిక్చర్స్ పతాకంపై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత ఈ సినిమాను నిర్మించింది. గుల్షన్ దేవయ్య, దిగంత్, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో నక్సలైట్, పెద్దింటి కోడలిగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో సమంత అదరగొట్టింది. మా ఇంటి బంగారం సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాతో దాదాపు మూడేళ్ల తర్వాత హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది సమంత.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Venky Anil Ravipudi Movie | రాయలసీమ బ్యాక్‌డ్రాప్ … కానీ నో వయలెన్స్ – వెంకీ అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ డేట్ రివీల్
జూన్ 21, 2026

Bhagyashri Borse | టాలీవుడ్ హీరోతో భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ లవ్‌స్టోరీ – హింట్ ఇచ్చేసిన యాంకర్ సుమ
జూన్ 21, 2026

OTT | 18 కోట్ల బడ్జెట్ – 70 కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
జూన్ 20, 2026
తాజావార్తలు
- ●Ammonia Gas Leak | తమిళనాడులో అమోనియం గ్యాస్ లీక్.. ఏడుగురు మృతి..!
- ●Venky Anil Ravipudi Movie | రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ... కానీ నో వయలెన్స్ - వెంకీ అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ డేట్ రివీల్
- ●Netherlands Vs Sweden | దుమ్మురేపిన నెదర్లాండ్స్
- ●NEET Re-Exam 2026 | రూ.30 వేలు కడితే 'నీట్' పేపర్ మీదే! వీడియో కాల్‌తో సైబర్ కేటుగాళ్ల వల.. దర్యాప్తులో పోలీసులు
- ●Suicide attempt | భార్యాభర్తల గొడవ.. పిల్లలకు ఎలుకల మందు తినిపించిన తల్లి
- ●Shiv Sena UBT Split | ఉద్ధవ్ సేనలో మరో భారీ చీలిక: నేడు ఏకగ్రీవంగా పార్టీని వీడనున్న ఆరుగురు రెబల్ ఎంపీలు

Ammonia Gas Leak | తమిళనాడులో అమోనియం గ్యాస్ లీక్.. ఏడుగురు మృతి..!

Venky Anil Ravipudi Movie | రాయలసీమ బ్యాక్‌డ్రాప్ ... కానీ నో వయలెన్స్ - వెంకీ అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ డేట్ రివీల్

Netherlands Vs Sweden | దుమ్మురేపిన నెదర్లాండ్స్

NEET Re-Exam 2026 | రూ.30 వేలు కడితే 'నీట్' పేపర్ మీదే! వీడియో కాల్‌తో సైబర్ కేటుగాళ్ల వల.. దర్యాప్తులో పోలీసులు



