George Kurian | కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా
George Kurian | కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ (George Kurian) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
George Kurian | కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ (George Kurian) తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ (Rajya Sabha) పదవీ కాలం ముగియడంతో మంత్రి మండలికి కురియన్ రాజీనామా చేశారు. కురియన్ రాజీనామాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. కురియన్ మైనారిటీ వ్యవహారాలతోపాటూ కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, డెయిరింగ్ శాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పీటీఐ నివేదిక ప్రకారం.. కేంద్ర మంత్రివర్గంలో ఏకైక క్రిస్టియన్ మంత్రి కురియనే. ఆయన రాజ్యసభ పదవీ కాలం జూన్ 21తో ముగిసింది. ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయలేదు. దీంతో ఆయన రాజీనామా చేశారు. కురియన్‌తోపాటూ మరో మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టుని కూడా ఈసారి రాజ్యసభకు నామినేట్ చేయలేదు.
65 ఏళ్ల కురియన్.. 1980లో బీజేపీ స్థాపించినప్పటి నుంచీ పార్టీలో సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యుడిగా, భారతీయ జనతా యువమోర్చా (BJYM) జాతీయ ఉపాధ్యక్షుడిగా, బీజేపీ కేరళ రాష్ట్ర యూనిట్ ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేశారు. జూన్ 9, 2024న కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకంటే ముందు కురియన్ జాతీయ మైనారిటీ కమిషన్ వైస్-చైర్మన్‌గా కూడా సేవలు అందించారు.
Also Read..
ఏఐ ఎఫెక్ట్.. 12 నెలల్లో 21,000 మందిని తొలగించిన ఒరాకిల్.. భవిష్యత్తులో మరిన్ని కోతలు
చిరు లీక్స్ ... సమంత జీవితంలోని గుడ్ న్యూస్‌ను బయటపెట్టిన మెగాస్టార్
వాట్సాప్‌లో కొత్త మాల్‌వేర్ ముప్పు.. ఈ ఫైళ్లను ఓపెన్ చేస్తే మీ కంప్యూటర్ హ్యాకర్ల చేతిలో..
సంబంధిత వార్తలు

Meenakshi Natarajan | నామినేషన్ తిరస్కరిస్తే.. ఈసీనే పరిష్కరించాలి : మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
జూన్ 12, 2026

TMC | టీఎంసీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. మరో ఎంపీ రిజైన్
జూన్ 11, 2026

Chanagani Dayakar | మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సిగ్గుచేటు: టీపీసీసీ నేత చనగాని దయాకర్
జూన్ 10, 2026
తాజావార్తలు
- ●CM Vijay | నటుడి పార్టీ అన్నారు.. రాజకీయాలు ఇంత క్రూరమా..? : అసెంబ్లీలో విజయ్ కీలక ప్రసంగం
- ●Telegram App | టెలిగ్రామ్ యాప్ సరిగ్గా పనిచేయడం లేదా.. ఈ సూచనలు పాటించండి..
- ●ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..
- ●Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? - సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష
- ●Vijay-Trisha | విజయ్ - త్రిష బంధానికి బ్రేకప్ పడిందా..? నెట్టింట కొత్త చర్చ
- ●Micro Plastics | తాగునీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఆర్వో ప్యూరిఫైయర్స్ అవసరం అంటున్న నిపుణులు..

CM Vijay | నటుడి పార్టీ అన్నారు.. రాజకీయాలు ఇంత క్రూరమా..? : అసెంబ్లీలో విజయ్ కీలక ప్రసంగం

Telegram App | టెలిగ్రామ్ యాప్ సరిగ్గా పనిచేయడం లేదా.. ఈ సూచనలు పాటించండి..

ITR Filing | ఐటీఆర్ ఫైలింగ్ సులభమే.. తొలిసారి రిటర్న్స్ దాఖలు చేసేవారికి పూర్తి గైడ్..

Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? - సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష



