Raghava Lawrence | ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని కాదు : రాఘవ లారెన్స్
Raghava Lawrence | తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై రాఘవ లారెన్స్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని తాను కాదు అంటూ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
Raghava Lawrence | ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) పేరే వినిపిస్తోంది. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండటమే ఇందుకు కారణం. ఇదే సమయంలో ఆయన ప్రజలను కించపరిచేలా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రజలను కుక్కలతో పోల్చి (Street Dog Analogy ) మాట్లాడారంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై రాఘవ లారెన్స్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని తాను కాదు అంటూ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కీలక పోస్టు పెట్టారు. "నా అభిమానులు, ప్రజలు నాకు అమ్మతో సమానమని నేను ఎప్పుడూ చెబుతుంటాను. అలాంటి నేను ప్రజలను కుక్కలతో పోల్చానని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అసత్యం" అని ఆయన పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఈ మేరకు ఇటీవలే ప్రెస్‌మీట్‌లో తాను చెప్పిన అసలు ఉద్దేశాన్ని వివరించారు.
"మనం ఒక కొత్త ఇంటికి మారినప్పుడు, అక్కడి పరిసరాలను, చివరికి ఆ ప్రాంతంలోని కుక్కల అలవాట్లను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని మాత్రమే నేను చెప్పాను. అంతేగానీ నేను ఎంతో గౌరవించే, అమ్మలా భావించే ప్రజలను కుక్కలతో పోల్చేంత కఠిన హృదయుడిని కాను. కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సమయం పడుతుందనే విషయం గురించి మాత్రమే నేను మాట్లాడాను. దయచేసి అందరూ పూర్తి వీడియోను చూసి, నేను నిజంగా ఏం చెప్పానో విని దాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను" అని స్పష్టం చేశారు.
Hi everyone,
I would like to clarify a misunderstanding regarding my recent press meeting.
I have always said that my fans and the people are equal to my mother. Some are spreading false news that I referred to people as dogs, which is completely untrue and misleading.
All I… pic.twitter.com/576GhWsI61
— Raghava Lawrence (@offl_Lawrence) June 14, 2026
Also Read..
అమెరికా వర్సిటీలో సుందర్ పిచాయ్‌కి నిరసన సెగ.. ప్రసంగిస్తుండగా వాకౌట్ చేసిన విద్యార్థులు
సీఎం విజయ్ విడాకుల కేసు మరోసారి వాయిదా - భర్తతో తెగతెంపులపై సంగీత యూటర్న్?
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ కామెడీ వెబ్‌సిరీస్ - సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా టాలీవుడ్ హీరో
సంబంధిత వార్తలు

Nayanthara | పూజా హెగ్డే హారర్ సినిమాలో గెస్ట్‌గా లేడీ సూపర్ స్టార్
జూన్ 13, 2026

Raghava Lawrence | మీరు ఓకే అంటే నా జర్నీ స్టార్ట్చేస్తా.. పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
జూన్ 12, 2026

Raghava Lawrence | రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్.. ఈ నెల 11న కీలక ప్రకటన
జూన్ 7, 2026
తాజావార్తలు
- ●PM Modi | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ
- ●Cow fell into the well | 200 అడుగుల లోతైన బావిలో పడిన ఆవు.. తర్వాత ఏం జరిగిందంటే!
- ●E20 Petrol | వాహనదారులకు ఈ20 పెట్రోల్ షాక్.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదట..
- ●Air India crash | తుదిదశలో అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు.. త్వరలోనే నివేదిక : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- ●TTD | తిరుమలలో సాలకట్ల జ్యేష్టాభిషేకం.. 28న ఆర్జిత సేవలు రద్దు
- ●Pawan Kalyan | కాంగ్రెస్ విభజించిన తీరునే తప్పుపట్టాం: పవన్ కళ్యాణ్

PM Modi | అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ

Cow fell into the well | 200 అడుగుల లోతైన బావిలో పడిన ఆవు.. తర్వాత ఏం జరిగిందంటే!

E20 Petrol | వాహనదారులకు ఈ20 పెట్రోల్ షాక్.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదట..

Air India crash | తుదిదశలో అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు.. త్వరలోనే నివేదిక : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు



