Telugu Web Series | ఓటీటీలోకి తెలుగు బోల్డ్ కామెడీ వెబ్‌సిరీస్ – సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ బోల్డ్ కామెడీ వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూపర్ సుబ్బు టైటిల్‌తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. డీజే టిల్లు ఫేమ్ మల్లిక్‌రామ్ దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Jun 15, 2026, 12.35 pm IST
Telugu Web Series | కెరీర్ ఆరంభం నుంచి రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథలు, పాత్రల పరంగా ప్రయోగాలు చేస్తోన్నాడు సందీప్ కిషన్. తాజాగా సందీప్‌కిషన్ తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేశాడు. బోల్డ్ కామెడీగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు సూపర్ సుబ్బు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డీజే టిల్లు ఫేమ్ మల్లిక్‌రామ్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
మిథిలా పాల్కర్...
సూపర్ సుబ్బు వెబ్‌సిరీస్‌లో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించగా...బ్రహ్మానందం, తనికెళ్లభరణి, గెటప్ శ్రీను, సంపూర్ణేష్ బాబు , మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. సందీప్ కిషన్ తెలుగులో నటిస్తోన్న ఫస్ట్ వెబ్‌సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఇందులో సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ఈ టాలీవుడ్ హీరో కనిపించబోతున్నాడు. డీజే టిల్లు బ్లాక్‌బస్టర్ తర్వాత డైరెక్టర్‌గా ఈ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మల్లిక్‌రామ్.
సుబ్బు కష్టాలు...
చిలుకూరి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బుకుటుంబం కట్టుబాట్లు, ఆచారాలకు ప్రాధాన్యమిస్తుంటుంది. సుబ్బుకు సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా జాబ్ వస్తుంది. తొలి పోస్టింగ్ మాకిపూర్ అనే ఊరిలో పడుతుంది. విచిత్రమైన ప్రవర్తన కలిగిన మనుషులు ఉన్న ఆ ఊరిలో సుబ్బు ఎలాంటి కష్టాలు పడ్డాడు? లైంగిక విజ్ఞానం పట్ట అవగాహన కల్పించాలని సుబ్బు చెప్పిన పాటలు ఆ ఊరిలో ఎలాంటి గొడవలకు దారితీశాయి అనే అంశాలతో బోల్డ్ కామెడీగా ఈ సిరీస్ రూపొందింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | అఫీషియల్ : ఓటీటీలోకి రష్మిక మందన్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ – తెలుగులో రిలీజ్
ఆగస్టు 2, 2026

Flipkart | ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే ప్రతి నెలా నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..
ఆగస్టు 1, 2026

Bigg Boss Thanuja | ఓటీటీలోకి బిగ్‌బాస్ రన్నరప్ తనూజ ఎంట్రీ – తెలుగు వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్
జులై 31, 2026
తాజావార్తలు
- ●Konda Surekha | వరంగల్‌ను రెండో మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- ●MLA Sudheer Reddy | 4 మీటర్ల లాంగ్ జంప్ ఎత్తేయండి
- ●TRAI | కాల్ క్వాలిటీపై ఇక ఫిర్యాదు చేయడం చాలా సులభం.. ట్రాయ్ కొత్త మైకాల్ యాప్ విడుదల..
- ●Aishwarya Rajesh | ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా
- ●AMCA Fighter Jet | స్వదేశీ ఫైటర్ జెట్లకు మన సొంత ఇంజిన్.. సఫ్రాన్-GTRE డీల్‌తో మారనున్న భారత వాయుసేన తలరాత
- ●Harish Rao | హరీశ్‌రావుపై ఓయూ పీఎస్‌లో ఫిర్యాదు

Konda Surekha | వరంగల్‌ను రెండో మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

MLA Sudheer Reddy | 4 మీటర్ల లాంగ్ జంప్ ఎత్తేయండి

TRAI | కాల్ క్వాలిటీపై ఇక ఫిర్యాదు చేయడం చాలా సులభం.. ట్రాయ్ కొత్త మైకాల్ యాప్ విడుదల..

Aishwarya Rajesh | ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి ఐశ్వర్య రాజేష్ తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా



