Raghava Lawrence | రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్.. ఈ నెల 11న కీలక ప్రకటన
Raghava Lawrence | తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ పేరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jun 7, 2026, 5.18 pm IST
Raghava Lawrence | తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ పేరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తరఫున తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాల మధ్య లారెన్స్ చేసిన తాజా ప్రకటన మరింత ఆసక్తిని రేకెత్తించింది. తన జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని జూన్ 11న వెల్లడించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా లారెన్స్ ప్రకటించారు.
11న కీలకమైన నిర్ణయం ప్రకటించనున్నట్లు ప్రకటన
తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే సమయంలో లారెన్స్ పేరు టీవీకే అభ్యర్థిగా ప్రచారంలోకి రావడంతో సోషల్ మీడియా వేదికగా అనేక కథనాలు చక్కర్లు కొట్టాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన ఎన్నికల బరిలో దిగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, ఈ ప్రచారంపై స్పందించిన లారెన్స్ తనను సంప్రదిస్తున్న మీడియా ప్రతినిధులకు స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రకటన విడుదల చేశారు. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికకు సంబంధించి వస్తున్న వార్తలను గమనిస్తున్నానని, ప్రస్తుతం తాను సినిమాల పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నానని చెప్పారు. లోకేష్ కనగరాజ్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘బెంజ్’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ నెల 10తో మూవీ షెడ్యూల్ పూర్తవుతుందని వెల్లడించిన ఆయన.. చివరగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ నెల 11 ఉదయం 9.30 గంటలకు తన తల్లి ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. అయితే, ఆ నిర్ణయం రాజకీయాలకు సంబంధించినదేనా? విజయ్ పార్టీతో ఆయన ప్రయాణం ప్రారంభమవుతుందా? లేక సినీ, సామాజిక రంగాలకు సంబంధించిన మరో అంశమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జూన్ 11న లారెన్స్ ఏం ప్రకటించబోతున్నారన్న ఆసక్తి అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.
రీల్ కాదు.. రియల్ హీరో..
రాఘవ రాలెన్స్ కేవలం సినిమాల్లో హీరో మాత్రమే కాదు. ఎంతో మంది పాలిట రియల్ హీరో. డ్యాన్స్ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా సినిమా రంగంలో ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో, తన దాతృత్వంతో అంతకంటే ఎక్కువ మంది హృదయాలను గెలుచుకున్నాడు. రాఘవ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్‌ని నెలకొల్పి అనాథ పిల్లలకు, వృద్ధులు, వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తూ పెద్దదిక్కుగా నిలిస్తున్నాడు. అలాగే, వందలాది మంది చిన్నారులకు ఉచితంగా సర్జరీలు చేయించి పునర్జర్మను ప్రసాదించాడు. పిల్లలను దత్తత తీసుకొని చదివిస్తున్నారు. వారి చదువులకు అయ్యే ఖర్చును మొత్తం భరించడంతో పాటు తన సొంతింటిని సైతం పేద పాఠశాలగా మార్చారు. రైతులకు ట్రాక్టర్లను అందించడంతో పాటు మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లు అందించాడు. ఎంతో మందికి లక్షలాది రూపాయలు అభాగ్యులకు అందించి ఆదుకున్నారు. తన తల్లి పేరు మీద 'కన్మణి అన్నదాన విరుందు' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించి పేదలకు ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నాడు. "మనం సంపాదించే దాంట్లో కొంతైనా సమాజానికి తిరిగి ఇవ్వాలి" అనే సిద్ధాంతాన్ని ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Hi everyone, News about me contesting in Trichy East election has been circulating across various media platforms.
All my Media friends have been reaching out to me over phone and requesting to meet me asking for clarification. Since the speculation has grown to a point where I… pic.twitter.com/68ZyN6P0l9
— Raghava Lawrence (@offl_Lawrence) June 7, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●HYDRAA | హైడ్రా ప్రజావాణికి విరామం.. మళ్లీ ఎప్పుడంటే
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అవమానం..!
- ●KTR | నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా? : రేవంత్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న
- ●Vande Bharat | హిందూపురంలో ఆవులను ఢీకొట్టిన వందే భారత్.. తప్పిన ప్రమాదం..
- ●Nithya Menen | టాలీవుడ్ ఒక్కటే కాదు .. అన్ని ఇండస్ట్రీలు ఇంతే - జాన్వీ కపూర్ పెద్ది వివాదంపై నిత్యా మీనన్ కామెంట్స్
- ●IND Vs AFG | ముల్లాన్‌పూర్ టెస్టులో ఆఫ్ఘన్‌పై భారత్ ఆధిపత్యం.. అరంగేట్రంలో అలరించిన మానవ్

HYDRAA | హైడ్రా ప్రజావాణికి విరామం.. మళ్లీ ఎప్పుడంటే

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అవమానం..!

KTR | నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా? : రేవంత్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న

Vande Bharat | హిందూపురంలో ఆవులను ఢీకొట్టిన వందే భారత్.. తప్పిన ప్రమాదం..





