Nayanthara | పూజా హెగ్డే హారర్ సినిమాలో గెస్ట్‌గా లేడీ సూపర్ స్టార్
తమిళ సూపర్ హిట్ హారర్ ఫ్రాంచైజ్ కాంచనలోకి నయనతార ఎంట్రీ ఇవ్వబోతుంది. కాంచన సిరీస్‌లో ప్రస్తుతం కాంచన 4ను తెరకెక్కిస్తోన్నారు హీరో కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్. పూజా హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీలో నయనతార ఓ సర్‌ప్రైజింగ్ రోల్‌లో కనిపించబోతున్నదట,.
Entertainment | Published On Jun 13, 2026, 2.53 pm IST
Nayanthara | రాఘవ లారెన్స్ హీరోగా నటించిన కాంచన సిరీస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ ఫ్రాంచైజ్‌కు కొనసాగింపుగా కాంచన 4 సినిమాను తెరకెక్కిస్తోన్నారు రాఘవ లారెన్స్. హీరోగా నటిస్తూనే ఈ హారర్ మూవీకి లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. తాజాగా కాంచన 4పై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ కీలక పాత్రలో నటించనుందట.
స్టార్ హీరోయిన్...
కాంచన సిరీస్ సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సెంటిమెంట్‌ను కాంచన 4లో ఫాలో అవుతోన్నారట లారెన్స్. హై ఎమోషనల్ సీన్లతో ఓ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను రాసుకున్నారట. కథలో కీలకంగా నిలిచే ఈ ఎపిసోడ్‌లో స్టార్ హీరోయిన్ నటిస్తే బాగుంటుందని భావించిన మేకర్స్ నయనతారను అప్రోచ్ అయ్యారట. కథతో పాటు క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు నచ్చడంతో నయన్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిందట. నయన్ క్యారెక్టర్ లెంగ్త్ మాత్రమే తక్కువేనని అంటున్నారు. ఇరవై నిమిషాల వరకు నయన్ స్క్రీన్‌పై కనిపిస్తుందట. కానీ క్యారెక్టర్ తాలూకు ప్రభావం మాత్రం సినిమా అంతా ఉంటుందట.
ఫస్ట్ టైమ్...
త్వరలోనే కాంచన 4 సెట్స్‌లో నయనతార అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ హారర్ మూవీలో పూజా హెగ్డే దయ్యంగా కనిపించబోతుండగా...నోరా ఫతేహి గ్లామర్ రోల్ చేస్తోంది. కాంచన 4తోనే కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పూజా హెగ్డే హారర్ జానర్‌ను టచ్ చేయబోతుంది. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో కాంచన 4 రూపొందుతోన్నట్లు సమాచారం.
హిందీలో సల్మాన్ ఖాన్‌తో...
ప్రస్తుతం నయనతార బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో కలిపి ఎనిమిదికిపైగా సినిమాలు చేస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్‌తో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తోంది. కన్నడంలో యశ్ టాక్సిక్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతుంది.
తాజావార్తలు
- ●Samajwadi Party | తృణమూల్, శివసేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్ జోష్.. వరుసగా లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Harish Rao | పదవులను వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి.. జిరాక్స్ కాపీలతో గద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హరీశ్‌రావు
- ●Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్
- ●Social Media | సోషల్ మీడియా కంటెంట్‌తో 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతం.. మెటా, టిక్‌టాక్‌పై కుటుంబాల న్యాయ పోరాటం..
- ●Alpha Trailer | అదిరిన ‘ఆల్ఫా’ ట్రైలర్.. యాక్షన్ మోడ్‌లో అలియా

Samajwadi Party | తృణమూల్, శివసేన అయిపోయింది.. ఇప్పుడు ఎస్పీ వంతు.. అఖిలేష్ పార్టీలో భారీ చీలిక..?

Stock Markets | స్టాక్ మార్కెట్ జోష్.. వరుసగా లాభాల్లో ముగిసిన సూచీలు..

Harish Rao | పదవులను వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి.. జిరాక్స్ కాపీలతో గద్దెనెక్కిన మోసాలు రేవంత్‌వి : హరీశ్‌రావు

Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్






