త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virosh | ప్ర‌ధాని మోదీని క‌లిసిన‌ విరోష్ జోడీ.. రిసెప్ష‌న్‌కు ఆహ్వానం

Virosh | విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్న‌ (Rashmika Mandanna).. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)ని క‌లిశారు.

D

Entertainment | Published On Feb 27, 2026, 2.13 pm IST

Virosh | ప్ర‌ధాని మోదీని క‌లిసిన‌ విరోష్ జోడీ.. రిసెప్ష‌న్‌కు ఆహ్వానం
Advertisement

Virosh | విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్న‌ (Rashmika Mandanna).. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)ని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మార్చి 4న హైద‌రాబాద్‌ (Hyderabad)లో జ‌రిగే వివాహ రిసెప్ష‌న్‌ (wedding reception)కు ప్ర‌ధానిని ఆహ్వానించారు. విజ‌య్‌-ర‌ష్మిక జంట‌గా వెళ్లి ప్ర‌ధానిని ఇన్వైట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ప్ర‌ధానితోపాటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప‌లువురు కేంద్ర మంత్రులు, ఎంపీల‌ను కూడా ఆహ్వానించారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహ బంధంతో ఒక్క‌టైన విష‌యం తెలిసిందే. రాజ‌స్థాన్ ఉద‌య్‌పూర్‌లోని మెమోంటోస్ హోట‌ల్‌లో ఫిబ్ర‌వ‌రి 26న వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. పెళ్లి ఫొటోల‌ను వీరిద్ద‌రు అభిమానుల‌తో పంచుకున్నారు. ర‌ష్మిక మెడ‌లో మూడుముళ్లు వేశాడు విజ‌య్. త‌న అర్ధాంగిగా ఆమెను జీవితంలోకి ఆహ్వానించారు. ఈ వేడుక‌కు అతికొద్ది మంది స్నేహితులు, కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. మార్చి 4న హైద‌రాబాద్ తాజ్ హోట‌ల్‌లో వీరి వివాహ రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

Also Read..

Taapsee | స్టార్ హీరోయిన్ల‌పై తాప్సీ సెటైర్లు - సొంత గుర్తింపు లేనివారంటూ కామెంట్స్‌

Whirlpool Protton NXT 3 Door | వర్ల్‌పూల్ నుంచి 3 డోర్ ఫ్రిజ్‌లు.. ధ‌ర రూ.27వేలే..

Whatsapp SIM Binding | సిమ్ లేకుండా ఇక వాట్సాప్ ప‌నిచేయ‌దా..? ఏమేం నియమాల‌ను విధించారు..?

Advertisement
Advertisement