Whirlpool Protton NXT 3 Door | వర్ల్‌పూల్ నుంచి 3 డోర్ ఫ్రిజ్‌లు.. ధర రూ.27వేలే..
Whirlpool Protton NXT 3 Door | గృహోపకరణాల తయారీ సంస్థ వర్ల్‌పూల్ భారత్‌లో ప్రోటాన్ ఎన్ఎక్స్‌టీ 3 డోర్ పేరిట నూతన ఫ్రిజ్ మోడల్స్‌ను విడుదల చేసింది. ఈ ఫ్రిజ్‌లలో అధిక స్టోరేజ్ లభిస్తుండడంతోపాటు కూలింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుందని, తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయని కంపెనీ తెలియజేసింది.
Whirlpool Protton NXT 3 Door | గృహోపకరణాల తయారీ సంస్థ వర్ల్‌పూల్ భారత్‌లో ప్రోటాన్ ఎన్ఎక్స్‌టీ 3 డోర్ పేరిట నూతన ఫ్రిజ్ మోడల్స్‌ను విడుదల చేసింది. ఈ ఫ్రిజ్‌లలో అధిక స్టోరేజ్ లభిస్తుండడంతోపాటు కూలింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుందని, తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయని కంపెనీ తెలియజేసింది. సాధారణ 2 డోర్ మోడల్స్‌తో పోలిస్తే ఈ కొత్త మోడల్ ఫ్రిజ్‌లు 43 శాతం మెరుగ్గా పనిచేస్తాయని తెలిపింది. ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో ఈ ఫ్రిజ్‌లు పాత మోడల్స్ కన్నా సమర్థవంతంగా పనిచేస్తాయని తెలియజేసింది.
బ్యాక్టీరియా, వైరస్‌లకు చెక్..
కొత్త ఫ్రిజ్‌లలో స్టోరేజ్‌ను అధికంగా పెంచారు. పండ్లు, కూరగాయల కోసం 40 శాతం అదనపు స్టోరేజ్ ఇచ్చినట్లు వివరించారు. ఫ్రిజ్ లో ఆయా భాగాల్లో చల్లని గాలి 360 డిగ్రీల కోణంలో వ్యాపిస్తుంది. దీంతో అన్ని పదార్థాలకు సమానంగా చల్లదనం లభించి అవి ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి. ఈ ఫ్రిజ్ మోడల్స్‌లో మైక్రో బ్లాక్ టెక్నాలజీని ఇచ్చినందున 99 శాతం వరకు బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తుంది. ఫ్రిజ్‌లో శుభ్రమైన వాతావరణం ఉండేలా చేస్తుంది. బ్యాక్టీరియా, ఇతర క్రిములను సమర్థవంతంగా అరికడుతుంది.
ధర వివరాలు..
వర్ల్‌పూల్ 3 డోర్ ఫ్రిజ్‌లలో యాక్టివ్ డియో సిస్టమ్‌ను ఇచ్చారు. దీని వల్ల వివిధ రకాల పదార్థాలను ఉంచినప్పుడు ఫ్రిజ్ వాసన రాకుండా ఉంటుంది. ఒక పదార్థం వాసన ఇంకో దానికి వ్యాపించకుండా ఉంటుంది. నిల్వ చేయబడిన ఆహార పదార్థాల వాసన వీలైనంత వరకు పోకుండా ఉంటుంది. ఫ్రెష్ ఎన్ఎక్స్‌టీ అనే టెక్నాలజీ వీటిలో ఉన్నందున పండ్లు, కూరగాయలపై అదనంగా ఉండే. తేమ తొలగిపోతుంది. దీంతో అవి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి. 2026 బీఈఈ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఫ్రిజ్ లను 4 స్టార్ రేటింగ్‌తో రూపొందించారు. ఇక ఈ కొత్త మోడల్ ఫ్రిజ్‌ల ప్రారంభ ధర రూ.27,500 కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్స్‌తోపాటు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలోనూ ఈ మోడల్స్‌ను విక్రయిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

OPPO Find X9s | ఫైండ్ ఎక్స్9ఎస్ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
మే 21, 2026

Surface Pro for Business | నూతన తరం సర్ఫేస్ బిజినెస్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్.. అద్భుతమైన ఫీచర్లు..
మే 20, 2026

Ambrane Reneo | టైప్-సి ఛార్జింగ్‌తో ఆంబ్రేన్ కొత్త బ్యాటరీలు.. ఒక్కటి 100 సాధారణ బ్యాటరీలకు సమానం!
మే 14, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



