Virosh Wedding | ఇట్స్ అఫీషియల్ – భార్యాభర్తలుగా మారిన విరోష్ – పెళ్లి ఫొటోలు వైరల్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న అఫీషియల్‌గా భార్యభర్తలుగా మారారు. ఉదయ్‌పూర్‌లోని మెమోంటోస్ హోటల్‌లో గ్రాండ్‌గా విరోష్ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా విజయ్, రష్మిక అభిమానులతో పంచుకున్నారు.
Entertainment | Published On Feb 26, 2026, 7.25 pm IST
Virosh Wedding | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఏడడుగులు వేశారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లితో తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. విజయ్, రష్మిక పెళ్లి రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని మెమోంటోస్ హోటల్‌లో ఘనంగా జరిగింది. పెళ్లి ఫొటోలను వీరిద్దరు అభిమానులతో పంచుకున్నారు. రష్మిక మెడలో మూడుముళ్లు వేశాడు విజయ్. తన అర్ధాంగిగా ఆమెను జీవితంలోకి ఆహ్వానించారు. మరోవైపు రష్మిక కూడా నా భర్తను విజయ్ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నా అంటూ పెళ్లి తర్వాత తొలి పోస్ట్‌ను సోషల్ మీడియాలో పెట్టింది.
వీరిద్దరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ ఫొటోల్లో ఆరెంజ్ గోల్డ్ కలర్ శారీలో పెళ్లి కూతురిగా రష్మిక మెరిసిపోతుండగా...వైట్ కలర్ ధోతీ, ఎరుపు రంగు పంచెతో విజయ్ కనిపించారు.
రెండు పద్దతుల్లో....
విజయ్, రష్మిక పెళ్లి హిందూ సంప్రదాయంతో పాటు కొడవ పద్దతిలో జరిగింది. గురువారం ఉదయం తెలంగాణ సంస్కృతి ప్రకారం ఈ జంట పెళ్లి చేసుకున్నారు. సాయత్రం కొడవ ఆచారాన్ని ఫాలో అవుతూ మరోసారి రష్మికను వివాహమాడారు విజయ్ దేవరకొండ. మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుక జరిగింది.
విజయ్, రష్మిక పెళ్లికి టాలీవుడ్ నుంచి సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్‌తో పాటు మరికొంతమంది అతిథులు హాజరయ్యారు. విజయ్, రష్మిక రిసెప్షన్ మార్చి 4న హైదారాబాద్‌లో జరుగనుంది.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






