Vijay Rashmika Marriage | నేను ఎక్కడ ఉన్నా…రష్మిక నా పక్కన ఉండాలి – పెళ్లిపై విజయ్ దేవరకొండ పోస్ట్
రష్మికతో పెళ్లి గురించి విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. తను ఎక్కడ ఉన్నా మనశ్శాంతి, ప్రశాంతంత కావాలంటే రష్మిక తన పక్కన ఉండాలని విజయ్ ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
Entertainment | Published On Feb 26, 2026, 9.38 pm IST
Vijay Rashmika Marriage | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. భార్యాభర్తలుగా మారారు. తమ పెళ్లి వేడుకల తాలూకు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. తమ ప్రేమ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఇద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. నా భర్త విజయ్ దేవరకొండను పరిచయం చేస్తున్నానంటూ రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నది. విజయ్‌పై ఉన్న ప్రేమను వ్యక్తం చేయాలంటే మాటలు సరిపోవంటూ ఈ పోస్ట్‌లో రష్మిక చెప్పింది.
మిస్సయ్యాను...
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. "ఒక రోజు.. తనని నేను చాలా మిస్ అయ్యాను. తను పక్కన ఉంటే ఆ రోజంతా ఇంకా బాగుండేదనిపించింది.
తను నా ఎదురుగా కూర్చుంటే.. నేను తినే భోజనం ఇంకా సంతృప్తిగా ఉంటుందనిపించింది. తను నాతో కలిసి ఉంటే.. జిమ్‌లో వర్కవుట్స్ ఒక శిక్షలా కాకుండా, ఇంకా సరదాగా సాగిపోయేవేమో అనిపించింది.
నేను ఎక్కడ ఉన్నా సరే.. ఒక ప్రశాంతత , మనశ్శాంతి కావాలంటే తను నా పక్కనే ఉండాలి. అందుకే నా స్నేహితురాలినే నా భార్యగా చేసుకున్నాను" అని విజయ్ దేవరకొండ ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు. విజయ్ పోస్ట్‌ను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
రెండు సినిమాలు...
పెళ్లికి ముందు విజయ్, రష్మిక కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేశారు. ఈ సినిమాల చిత్రీకరణలోనే ప్రేమలో పడ్డ ఈ జంట ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కారు. విరోష్ పెళ్లికి కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



