Taapsee | స్టార్ హీరోయిన్లపై తాప్సీ సెటైర్లు – సొంత గుర్తింపు లేనివారంటూ కామెంట్స్
స్టార్ హీరోయిన్లతో పాటు అగ్ర దర్శకులపై తాప్సీ ఫైర్ అయ్యింది. పెద్ద సినిమాలు చేస్తూ భారీగా రెమ్యూనరేషన్లు తీసుకుంటున్న కొందరు హీరోయిన్లకు వారికంటూ సొంతంగా గుర్తింపు లేదని తాప్సీ చెప్పింది. ప్రస్తుతమున్న టాప్ డైరెక్టర్లు అవుటాఫ్ ది బాక్స్ అస్సలు ఆలోచించలేకపోతున్నారంటూ కామెంట్లు చేసింది.
Entertainment | Published On Feb 27, 2026, 1.30 pm IST
Taapsee | ఇటీవల దక్షిణాది సినిమా ఇండస్ట్రీపై తాప్సీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డైరెక్టర్ల తీరుపై ఘాటుగానే విమర్శలు చేసింది. ఈ వివాదం సద్దుమణగకముందే తాప్సీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి స్టార్ హీరోయిన్లతో పాటు అగ్ర దర్శకులపై విరుచుకుపడింది. హీరోలకే కాదు...హీరోయిన్లకు కూడా సొంతంగా గుర్తింపు ఉండాలని, లేదంటే వారు ఎన్ని సినిమాలు చేసినా ఉపయోగం లేదని తాప్సీ చెప్పింది.
నా మనసు చెప్పినట్లే వింటాను...
"ఓ సినిమా చేసే ముందు అందులో స్టార్ హీరోలు ఉన్నారా? టాప్ డైరెక్టర్ సినిమానా అనే లెక్కలేవి వేసుకోను. కథ, నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటాను. నా మనసు చెప్పినట్లే నడుచుకుంటాను. అంతే తప్ప ఇతర అభిప్రాయాలకు అస్సలు విలువ ఇవ్వను. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్లు తీసుకోవడం, టాప్ ప్లేస్‌లో ఉండటం కాదు. హీరోయిన్లకు వారికంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉండటమే నా దృష్టిలో అసలైన విజయంగా భావిస్తాను. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో చాలా మంది పెద్ద సినిమాలే చేస్తున్నారు. సినిమాల పేర్లు చెబితేకానీ వారిని ఆడియెన్స్ గుర్తుపట్టలేరు. వారికంటూ సొంత ఇమేజ్ లేదు. డబ్బులే కావాలని అనుకుంటే నేను భారీ బడ్జెట్ సినిమాలు చాలానే చేసే దానిని. రెమ్యూనరేషన్లు, నంబర్ గేమ్స్ కంటే నా పాత్రలతోనే ఆడియెన్స్ మనసులో నిలిచిపోవాలని కోరుకున్నాను. ఆ విషయంలో నేను హ్యాపీగా ఉన్నానని" తాప్సీ అన్నది.ఈ కామెంట్లు ఏ హీరోయిన్‌ను ఉద్దేశించి తాప్సీ చేసింది అన్నది ఆసక్తికరంగా మారింది.
స్టార్ డైరెక్టర్ల అసమర్థత...
స్టార్ డైరెక్టర్లపై కూడా తాప్సీ ఫైర్ అయ్యింది. దర్శకుల అసమర్థత, బద్ధకం వల్ల కొత్తగా సినిమాలు చేయాలని ఆలోచించే తన లాంటి వారికి చాలా అన్యాయం జరుగుతుందని తాప్సీ అన్నది. ఓ పాత్ర అనుకోగానే ఫలానా వారే బాగుంటారనే దర్శకులు ఫిక్సవుతారు. "ఒకే రకమైన పాత్రలకు ఒకే ముఖాలను రిపీట్ చేస్తుంటారు. అవుటాఫ్‌ది బాక్స్ అస్సలు ఆలోచించరు. ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని నిరూపించుకోవడానికి చాలా కష్టపడాల్సివస్తుంది" అని తాప్సీ అన్నది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



