Trisha Krishnan | విడాకులపై నమ్మకం లేదు.. పెళ్లి చేసుకోవాలంటే వెయ్యి సార్లు ఆలోచిస్తా : త్రిష పోస్ట్ వైరల్
ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే విషయంలో నేను చాలా క్లారిటీతో ఉంటే. పెళ్లికి ముందు మనకు ఆ వ్యక్తి సెట్ అవుతాడా లేదా? అనే విషయంలో ఎలాంటి సందేహాలు ఉండకూడదు. అతడు పర్‌ఫెక్ట్ అనుకుంటేనే రిలేషన్‌షిప్ స్టార్ట్ చేస్తా.. అంటూ త్రిష సంచలన వ్యాఖ్యలు చేసింది.
Entertainment | Published On Mar 10, 2026, 3.37 pm IST
Trisha Krishnan | ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు నటి త్రిష చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె ఎన్నికల్లో పోటీ చేసేది లేదు.. రాజకీయాల్లో వచ్చేది లేదు కానీ.. టీవీకే అధినేత విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారిగా త్రిష లైమ్ లైట్‌లోకి వచ్చింది. ఓవైపు విజయ్ తన భార్యకు విడాకులిస్తుండటం, భార్య ఆరోపణలు చేయడం, మరోవైపు విజయ్, త్రిష కలిసి తిరగడం తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు ఇది ఒక చాన్స్‌గా దొరకడంతో త్రిషను ఇందులోకి లాగి విజయ్‌ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే త్రిష ఆ మధ్య పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో త్రిషను అడగడంతో అప్పుడు త్రిష చేసిన వ్యాఖ్యలు తాజా వైరల్ అవుతున్నాయి.
Also Read: Trisha Krishnan | పార్థీబన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన త్రిష.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్..!
ఎవర్ని చేసుకోవాలో పక్కా క్లారిటీతో ఉంటా
ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే విషయంలో నేను చాలా క్లారిటీతో ఉంటే. పెళ్లికి ముందు మనకు ఆ వ్యక్తి సెట్ అవుతాడా లేదా? అనే విషయంలో ఎలాంటి సందేహాలు ఉండకూడదు. అతడు పర్‌ఫెక్ట్ అనుకుంటేనే రిలేషన్‌షిప్ స్టార్ట్ చేస్తా. నాకు విడాకులపై నమ్మకం లేదు. నా జీవితం మొత్తం అతడితో బతకాలి కాబట్టి నా జీవితాంతం సంతోషంగా అతడితో ఉండగలను అని నమ్మితేనే పెళ్లికి సిద్ధమవుతా. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే ఇక విడాకులు అనే మాటే ఉండదు నా లైఫ్‌లో.. అందుకే పెళ్లికి ముందే వెయ్యి సార్లు ఆలోచించి ముందడుగు వేస్తా.. అంటూ త్రిష చెప్పుకొచ్చింది.
ఇదీ చదవండి : Lavanya Tripathi | సోషల్ మీడియాలో మెగా కోడలిపై అసభ్య కామెంట్లు
View this post on Instagram
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






