Megastar Chiranjeevi | సంక్రాంతి బరిలోకి మెగాస్టార్.. ఈ సారైనా ‘విశ్వంభర’ వస్తాడా?
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘విశ్వంభర’ విడుదలపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Entertainment | Published On Nov 25, 2026, 3.41 pm IST
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘విశ్వంభర’ విడుదలపై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ.. టీజర్‌లో కనిపించిన గ్రాఫిక్స్ ప్రేక్షకులను కొంత నిరాశకు గురిచేశాయి. దీంతో విమర్శలను పరిగణనలోకి తీసుకున్న చిత్రబృందం విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి మళ్లీ సీజీఐ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా ‘విశ్వంభర’ విడుదల తేదీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పటికే చిరంజీవి మరో చిత్రం ‘కాకా’ సంక్రాంతి బరిలో నిలిచింది. దాంతో రెండు సినిమాల రిలీజ్‌పై గందరగోళం నెలకొంది. ‘కాకా’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. తాజాగా మరోసారి ‘విశ్వంభర’ పేరు సంక్రాంతి రేసులో వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని పండుగ సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారంటూ టాలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతున్నది. జనవరి 13న సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ను విడుదల చేయనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. రిలీజ్ డేట్‌పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
దీంతో మెగా అభిమానుల్లో ఆసక్తితో పాటు కొంత గందరగోళం నెలకొంది. ఒకవైపు ‘విశ్వంభర’, మరోవైపు ‘కాకా’.. ఈ రెండు సినిమాల్లో ఏది సంక్రాంతి బరిలో నిలుస్తుంది? విడుదల తేదీల విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలో ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సంక్రాంతికి విశ్వంభర వస్తుందా? లేదంటే ‘కాకా’ నే రేసు నుంచి తప్పుకుంటాడా? అన్న చర్చ నడుస్తోంది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. గ్రాఫిక్స్ పనులు, రిలీజ్ డేట్‌పై నెలకొన్న సందిగ్ధతకు త్వరలోనే తెరపడుతుందేమో చూడాలి. మెగాస్టార్‌ను మరోసారి ఫాంటసీ ప్రపంచంలో చూడాలన్న అభిమానుల ఎదురుచూపులకు సంక్రాంతి వేళ తెరపడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట
- ●Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి..
- ●Ruhani Sharma | రుహానీ శర్మలో మరో యాంగిల్.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్!
- ●CM Revanth Reddy | నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడాలి
- ●Indian Rare Earth Stocks | 2027లో దృష్టి పెట్టాల్సిన 5 అరుదైన ఖనిజాల స్టాక్స్.. భారీ వృద్ధికి అవకాశాలు..
- ●ACB | ఏసీబీలో అవినీతికి ఆస్కారం లేదు.. విద్యుత్ శాఖ మాజీ ఏడీఈ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ

Rahul Gandhi | రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి..

Ruhani Sharma | రుహానీ శర్మలో మరో యాంగిల్.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్!

CM Revanth Reddy | నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడాలి





