త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha Krishnan | పార్థీబన్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన త్రిష.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్‌..!

Trisha Krishnan | ప్రముఖ హీరోయిన్‌ త్రిష కృష్ణన్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ కోలీవుడ్‌లో చర్చకు దారితీసింది. ఇటీవల తన గురించి వచ్చిన వార్తలు, అలాగే ఒక అవార్డు కార్యక్రమంలో తనపై చేసిన వ్యాఖ్యలపై ఆమె పరోక్షంగా స్పందించింది. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆ వ్యాఖ్యలు దర్శకుడు, నటుడు ఆర్‌ పార్థీబన్‌ను ఉద్దేశించేనని భావిస్తున్నారు.

P

Entertainment | Published On Mar 9, 2026, 10.50 am IST

Trisha Krishnan | పార్థీబన్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన త్రిష.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్‌..!
Advertisement

Trisha Krishnan | ప్రముఖ హీరోయిన్‌ త్రిష కృష్ణన్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ కోలీవుడ్‌లో చర్చకు దారితీసింది. ఇటీవల తన గురించి వచ్చిన వార్తలు, అలాగే ఒక అవార్డు కార్యక్రమంలో తనపై చేసిన వ్యాఖ్యలపై ఆమె పరోక్షంగా స్పందించింది. ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆ వ్యాఖ్యలు దర్శకుడు, నటుడు ఆర్‌ పార్థీబన్‌ను ఉద్దేశించేనని భావిస్తున్నారు. త్రిష పోస్ట్‌లో ‘ఒక వ్యక్తి తన అసిస్టెంట్ చెప్పడంతో చివరి నిమిషంలో నిర్వాహకులు కార్యక్రమంలో నా పేరు, ఫొటోను చేర్చినట్లు తెలిసింది. మైక్ చేతిలో ఉందని ఎవరైనా తెలివైనవారిగా మారిపోరు. చెప్పే మాటల్లో హాస్యం పండదు.

ఆ వ్యాఖ్యలు అసలు విషయాన్ని కాకుండా మూర్ఖత్వాన్నే బయటపెడతాయి. అవగాహన లేకుండా అసభ్య పదాలు ఉపయోగించి మాట్లాడే వారి సంస్కారం, ఆలోచనా స్థాయిని మాత్రమే చూపిస్తుంది’ అంటూ తనపై చేసిన విమర్శలకు విమర్శలకు ఘాటుగా బదులిచ్చింది. ఈ వివాదానికి కారణమైన సంఘటన ఇటీవల జరిగిన ఒక అవార్డుల కార్యక్రమం. ఆ వేడుకలో మాట్లాడిన పార్థిబన్, త్రిష ఫొటోను చూపిస్తూ ఆమె పోషించిన ‘కుందవై’ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజులపాటు ఆ ‘కుందవై’ని ఇంట్లోనే ఉంచితే మంచిదని, బయటకు రానివ్వకూడదని ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తాజాగా త్రిష చేసిన పోస్టును ఆ వ్యాఖ్యలకు కౌంటర్‌గా పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల త్రిష నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌తో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ సమయంలో ఇద్దరూ వేదికపై కలిసి కనిపించడం, ఫొటోలకు పోజులివ్వడం, అక్కడి నుంచి కూడా ఒకేసారి, ఒకే కారులో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

విజయ్ వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ సంఘటన కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీసింది. విజయ్‌కి ఆయన భార్య సంగీత సొర్నలింగం విడాకులు ఇవ్వనున్నది. కోర్టులో విడాకుల పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పరిణామాణల నేపథ్యంలో పార్థీబన్‌ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పార్థీబన్‌ స్పందించారు. ఎక్స్ ఖాతా ద్వారా క్షమాపణలు చెప్పారు. త్రిషను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని తెలిపారు. దాంతో ఈ వివాదం ముగింపు పలికినట్లయ్యింది.

Advertisement
Advertisement