త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త్రిష పేరుతో త‌మిళ‌నాడులో కొత్త అసోసియేష‌న్ – రాజ‌కీయ అరంగేట్రానికి స‌న్నాహాలు షురూ?

త్రిష రాజ‌కీయ అరంగేట్ర వార్త‌లు మ‌రోసారి త‌మిళ‌నాట గుప్పుమ‌న్నాయి. త్రిష పేరిట ఆమె అభిమానులు తిరున‌ల్వేలిలో ఇళ‌య పుర‌ట్చి త‌లైవి త్రిష పేర‌వై పేరుతో నూత‌న అసోసియేష‌న్‌ను ఏర్పాటుచేశారు. ఈ అసోసియేష‌న్ ద్వారా ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

N

Entertainment | Published On Nov 23, 2026, 2.34 pm IST

Trisha | త్రిష పేరుతో త‌మిళ‌నాడులో కొత్త అసోసియేష‌న్ – రాజ‌కీయ అరంగేట్రానికి స‌న్నాహాలు షురూ?
Advertisement

Trisha |చెన్నై క్వీన్ త్రిష పొలిటిక‌ల్ ఎంట్రీ వార్త‌లు మ‌రోసారి త‌మిళ‌నాట గుప్పుమ‌న్నాయి. సీఎం విజ‌య్ టీవీకే పార్టీ ద్వారా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో త్రిష పోటీ చేయ‌బోతున్న‌ట్లు చాలా కాలంగా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఎంపీగా ఆమె రాజ్య‌స‌భ్య‌కు పంపించే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయంటూ వార్త‌లొస్తున్నాయి. రాజ‌కీయ అరంగేట్రంపై త్రిష ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా తెర వెనుక ఇందుకు సంబంధించిన ప‌నుల‌న్నీ సెలైంట్‌గా జ‌రుగుతోన్న‌ట్లు చెబుతోన్నారు.

కొత్త అసోసియేష‌న్‌...

తాజాగా త్రిష పేరు మీద చెన్నైలో మ‌రో కొత్త అభిమాన సంఘం ఏర్పాటుకావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌మిళ‌నాడులోని తిరున‌ల్వేలిలో త్రిష అభిమానులు ఇళ‌య పుర‌ట్చి త‌లైవి త్రిష పేర‌వై పేరుతో నూత‌న సంస్థ‌ను స్థాపించారు. ప‌ద‌వుల కోసం కాకుండా త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం ఈ అసోసియేష‌న్ ప‌నిచేస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

ప్ర‌భుత్వ ప‌థ‌కాలు...

ఈ నూత‌న అసోసియేష‌న్‌పై త్రిష పేరిట ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో పాటు ఉచిత వైద్య శిబిరాలు, న్యాయ స‌ల‌హా కేంద్రాల‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతే కాకుండా టీవీకే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేరేలా అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాల‌ను అందించేలా ఈ అభిమాన సంఘం ప‌ని చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. నిర్వ‌హ‌కులు త్రిష‌ను జ‌య‌ల‌లిత‌తో పోలుస్తూ ఇళ‌య పుర‌ట్చి అంటూ సంబోంధించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.త్రిష రాజ‌కీయాల్లోకి రావ‌డం క‌న్ఫామ్ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు. అసోసియేష‌న్ లోగోను రిలీజ్ చేశారు.
ఇళ‌య పుర‌ట్చి త‌లైవి త్రిష పేర‌వై ఏర్పాటుతో మ‌రోసారి త్రిష పొలిటిక‌ల్ ఎంట్రీ వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌డానికి స‌న్నాహ‌కంగానే త్రిష త‌ర‌ఫున ఆమె అభిమానులు ఈ అసోసియేష‌న్‌ను ఎర్పాటుచేశార‌ని అంటున్నారు.

విజ‌య్‌తో రిలేష‌న్‌...

అయితే ఈ అసోసియేష‌న్ ఏర్పాటుపై త్రిష మాత్రం రియాక్ట్ కాలేదు. రాజ‌కీయాల‌పై సెలైంట్‌గా ఉంటున్న త్రిష విజ‌య్‌తో రిలేష‌న్‌ను కొన‌సాగిస్తోంది. ఇటీవ‌ల వైఎస్ ష‌ర్మిల కూతురు వివాహ వేడుక‌లో విజ‌య్‌తో క‌లిసి పాల్గొన్న‌ది.

 

Advertisement
Advertisement