త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | రామ్ చ‌ర‌ణ్ కంటికి స‌ర్జ‌రీ.. చిరంజీవి పోస్ట్ వైర‌ల్‌

Ram Charan | మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌ చరణ్ (Ram Charan) కంటికి శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింది. ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

D

Entertainment | Published On Mar 26, 2026, 10.39 am IST

Ram Charan | రామ్ చ‌ర‌ణ్ కంటికి స‌ర్జ‌రీ.. చిరంజీవి పోస్ట్ వైర‌ల్‌
Advertisement

Ram Charan | పెద్ది (Peddi) సినిమా సెట్స్‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌ చరణ్ (Ram Charan) గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. చ‌ర‌ణ్ కంటి వ‌ద్ద గాయ‌మైంది. తాజాగా ఆ గాయానికి శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింది. ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. చ‌ర‌ణ్ కంటికి విజ‌య‌వంతంగా స‌ర్జ‌రీ (Eye Surgery) చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌ (Dr. Sudhakar Prasad)కి చిరు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ చ‌ర‌ణ్ త్వ‌ర‌గా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.

బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది (Peddi) సినిమా సెట్స్‌లో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా రామ్ చరణ్ ఎడమ కంటికి స్వల్ప గాయమైంది. ప్ర‌స్తుతం ఆయ‌న కోలుకుంటున్నారు. మ‌రోవైపు చరణ్‌తో ఉన్న కీలక సన్నివేశాలను హైద‌రాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక ప్రత్యేక గీతాన్ని షూట్‌ చేయనున్నారట. రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) శుక్రవారం కావడంతో, ఆ రోజున ఒక టీజర్‌ను విడుదల చేస్తారని తెలుస్తున్న‌ది. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) క‌థానాయిక‌గా నటిస్తున్న‌ది. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్‌ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 30న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్ప‌టికే ఒక‌సారి వాయిదాప‌డిన ఈ మూవీ.. తాజాగా ఈ తేదీలో కూడా పెద్ది విడుదల కావడం కష్టమేనని వార్తలు వస్తున్నాయి.

Also Read..

Medaram | మేడారం గద్దెల వద్ద జారిపడి రాతిశిల.. బాలుడికి తీవ్ర గాయాలు

Meta Layoffs | ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు.. వంద‌లాది మంది ఉద్యోగుల‌పై మెటా వేటు..?

Hormuz opens for India | హ‌ర్మూజ్‌లో భార‌త నౌక‌ల‌పై ఎలాంటి ఆంక్ష‌ల్లేవ్‌.. ఇరాన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

Advertisement

తాజావార్తలు

Advertisement