త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta Layoffs | ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు.. వంద‌లాది మంది ఉద్యోగుల‌పై మెటా వేటు..?

Meta Layoffs | మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నేతృత్వంలోని మెటా సంస్థ భారీగా ఉద్యోగుల కోత‌కు (Meta Layoffs) సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది. సంస్థ‌లోని కీల‌క విభాగాల్లో వంద‌లాది మంది ఉద్యోగుల‌ను (Employees) తొల‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం.

D

Business | Published On Mar 26, 2026, 10.25 am IST

Meta Layoffs | ఏఐ రంగంలో భారీగా పెట్టుబడులు.. వంద‌లాది మంది ఉద్యోగుల‌పై మెటా వేటు..?
Advertisement

Meta Layoffs | మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నేతృత్వంలోని మెటా సంస్థ భారీగా ఉద్యోగుల కోత‌కు (Meta Layoffs) సిద్ధ‌మైన‌ట్లు తెలిసింది. సంస్థ‌లోని కీల‌క విభాగాల్లో వంద‌లాది మంది ఉద్యోగుల‌ను (Employees) తొల‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ లేఆఫ్స్ ప్ర‌ధానంగా సేల్స్, రిక్రూటింగ్, రియాలిటీ ల్యాబ్స్ విభాగాల‌పై ప‌డ‌నుంద‌ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపినట్లు అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ లేఆఫ్స్ ప్ర‌భావం అమెరికాతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలోని ఉద్యోగులపై ప‌డ‌నుంది.

2025 డిసెంబర్ 31 నాటికి కంపెనీలో దాదాపు 79వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 1.3 శాతం అంటే వెయ్యి మందిని తొల‌గించేందుకు కంపెనీ సిద్ధ‌మైంది. తొల‌గింపులు త‌క్కువ స్థాయిలోనే ఉన్న‌ప్ప‌టికీ.. రియాలిటీ ల్యాబ్స్ వంటి కీల‌క విభాగాల‌పై దీని ప్ర‌భావం ఉండ‌టం గ‌మ‌నార్హం. ఫైర్‌కు గురైన కొంద‌రికి ఇత‌ర విభాగాల్లో లేదా వేరే లొకేషెన్ల‌లో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే అవ‌కాశం కూడా ఉంద‌ని స‌ద‌రు వ్య‌క్తి తెలిపిన‌ట్లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్ర‌గామిగా ఎదిగేందుకు మెటా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే డేటా సెంటర్ల నిర్మాణానికి 2028 నాటికి 600 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్రణాళికలు రూపొందించినట్లు కూడా మెటా తెలిపింది. ఇటీవలే మెటా సంస్థ మోల్ట్‌బుక్ అనే ఏఐ ఏజెంట్ల కోసం రూపొందించిన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేసింది. అలాగే చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ మానస్ ను కొనుగోలు చేయడానికి కనీసం 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడుల వల్ల సంస్థలో సామర్థ్యం పెరుగుతుందని జుకర్‌బర్గ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు.

కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు సంస్థ సిద్ధ‌మైంది. త‌న మొత్తం శ్రామిక శ‌క్తిలో దాదాపు 20 శాతం కోత విధించాల‌ని (16 వేల మంది) సంస్థ యోచిస్తున్న‌ట్లు రాయిట‌ర్స్ ఇప్ప‌టికే నివేదించిన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌ణాళిక‌లో భాగ‌మే తాజా లేఆఫ్స్‌గా తెలుస్తోంది.

Also Read..

హ‌ర్మూజ్‌లో భార‌త నౌక‌ల‌పై ఎలాంటి ఆంక్ష‌ల్లేవ్‌.. ఇరాన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ప‌ద్మాన‌దిలో ప‌డిన బ‌స్సు.. 23 మంది దుర్మ‌ర‌ణం.. వీడియో

టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 13 మంది మృతి

Advertisement

తాజావార్తలు

Advertisement