ISRO | మరోసారి అద్భుతం చేసిన ఇస్రో.. చందమామ కీలక సమాచారం పంపిన విక్రమ్ ల్యాండర్..!
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరోసారి అద్భుతం చేసింది. చంద్రయాన్-3 మిషన్‌తో మరో సరికొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. శివశక్తి పాయింట్‌లో చిక్కుకుపోయిన విక్రమ్ ల్యాండర్ మరోసారి చంద్రుడి గురించి కీలక సమాచారాన్ని పంపింది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరోసారి అద్భుతం చేసింది. చంద్రయాన్-3 మిషన్‌తో మరో సరికొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. శివశక్తి పాయింట్‌లో చిక్కుకుపోయిన విక్రమ్ ల్యాండర్ మరోసారి చంద్రుడి గురించి కీలక సమాచారాన్ని పంపింది. 2023లో చేపట్టిన చంద్రయాన్ మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగిన విషయం తెలిసిందే. కొద్దిగంటల పాటు ప్రయోగాలు చేపట్టిన తర్వాత మిషన్‌ను నిలిపివేశారు. అయితే, ల్యాండర్‌ల ఇంకా ఇంధన మిగిలే ఉండడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్‌ను కొద్ది ఎత్తు వరకు తీసుకువెళ్లి ల్యాండ్ చేశారు. ఈ సమయంలో ఇంజిన్ల నుంచి వచ్చిన ప్రభావంతో పైపొరలోని సుమారు 3 సెంటీమీటర్ల మేరు పేరుకుపోయిన మట్టి అంతా తొలగిపోయింది.
దీంతో రెక్కల గాలికి ఎప్పటికీ సూర్యకాంతి తాకని లోతైన మట్టి పొరలు సైతం వెలుగు చూశాయి. ఈ డేటా ఆధారంగా చంద్రుడి ఉపరితలం పొరలుగా ఉందని, పైభాగం చాలా మెత్తగా ఉండగా కేవలం 6 సెంటీమీటర్ల లోతులోనే గట్టి, జిగురు మట్టిగా మారుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమధ్యరేఖ ప్రాంతాల్లో జరిగిన అపోలో మిషన్లతో పోలిస్తే ఈ తేడా మరింత స్పష్టంగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ పరిశోధన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టనున్న ఆర్టెమిస్ మిషన్‌కు కీలకం కానుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై మానవ స్థావరాలను ఏర్పాటు చేసే ప్రణాళికలకు ఈ మట్టి పొరల స్వభావం గురించిన కీలక సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

HD Kumaraswamy | కర్నాటకలో సర్ కార్యక్రమం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కేంద్రమంత్రి కుమారస్వామి
జులై 4, 2026

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

CS Review | స్పెషల్ కాంటింజెన్సీ పంట ప్రణాళికలు సిద్ధం చేయాలి.. కలెక్టర్లకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
జులై 4, 2026
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం



